Shruti Haasan : కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ ఈ సంక్రాంతికి రెండు సినిమాలతో పలకరించబోతుది. ఆమె నటించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య విడుదలకు సిద్ధం అవుతున్నాయి. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో శృతి హాసన్ హీరోయిన్ గా ఉండగా, ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి విడుదల కానుండడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరోవైపు కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
శృతి నటించిన చిరు-బాలయ్యల చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతుండగా.. మూవీ ప్రమోషన్ కార్యక్రమాలలో శృతి కూడా యాక్టివ్‌గా పాల్గొంటుంది. తాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ కెరీర్ బిగినింగ్ లో కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొన్నట్లు శృతి వెల్లడించారు. చాలామంది నా హైట్ ని లోపంగా చూశారు. ఇంత హైట్ ఉన్నావేంటని పరోక్షంగా ఎగతాళి చేయగా, ఇప్పుడు అదే హైట్ నాకు ప్లస్ అయ్యింది. ప్రభాస్, మహేష్ వంటి హీరోలతో జతకట్టినప్పుడు పొడుగుగా ఉండటం మంచిదైందని చెప్పుకొచ్చింది శృతి హాసన్. నాలో కొన్ని లోపాలు ఉన్నాయి. అయితే వాటిని నేను అధిగమిస్తూ వచ్చానని శృతి మరో మాటగా చెప్పారు.
చిన్న వయసులోనే శృతి హాసన్ సింగర్‌గా పరిచయమైంది. ఆ తర్వాత స్వయంగా ఎన్నో ఆల్బమ్‌లను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ‘హే రామ్’ అనే చిత్రంలో చిన్న పాత్రతో తెరకు ఎంటర్ కాగా, అనంతరం ‘లక్’ అనే హిందీ మూవీలోనూ కనిపించింది. ఇక, తెలుగులో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’తో శృతి హీరోయిన్‌గా ప్రయాణం మొదలెట్టి తర్వాత స్టార్‌గా ఎదిగింది.గబ్బర్ సింగ్ చిత్రంతో శృతి హాసన్ క్రేజ్ తెలుగులో బాగా పెరిగింది. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే శృతి హాసన్ విదేశీ గాయకుడు మైకేల్ కోర్సలేతో డేటింగ్ చేసింది. కానీ, ఊహించని విధంగా వీళ్లిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం డూడుల్ ఆర్టిస్ట్ శాంతనుతో పీకల్లోతు ప్రేమలో ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…