Balakrishna : నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆనతి కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ గురించి ఆయనతో పని చేసిన డైరెక్టర్లు ఎంతో గొప్పగా చెబుతారనే సంగతి తెలిసిందే. అభిమానులకు ఎంతో విలువ ఇచ్చే స్టార్ హీరోలలో బాలకృష్ణ ఒకరు కాగా, ఆయన ఎప్పుడు నిర్మాతల శ్రేయస్సును కోరుకుంటారని ఆయనతో పని చేసిన నిర్మాతలు చాలా సార్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా కూడా ఆదుకునే హీరోలలో బాలకృష్ణ ముందువరసలో ఉంటారు.
బాలకృష్ణ చూడడానికి చాలా సీరియస్‌గా కనిపిస్తారు. కాని ఆయన మనసు మాత్రం వెన్న అని అభిమానులు చెబుతుంటారు. ఎన్నో హిట్ చిత్రాలతో అలరించిన బాలకృష్ణ సినిమాలలో ఒక కామన్ పాయింట్ ఉంది. బాలయ్య తన సినిమాలలో వరుస ఆఫర్ లతో బిజీ ఉండే ఇతర భాషలకు చెందిన నటుల కంటే అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తెలుగు వారికే ఎక్కువగా ఆఫర్స్ ఇస్తుంటాడు. ఆఫర్ ల కోసం ఎదురు చూస్తున్నవారికి అవకాశం ఇవ్వడం వల్ల కొత్తవారికి ఛాన్స్ ఇచ్చినట్టు అవ్వడంతో పాటూ వారి టాలెంట్ నిరూపించుకోవడానికి మనం ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని దర్శక నిర్మాతలకు చెబుతుంటాడట.
బాలయ్య మంచి మనస్సు గురించి తెలుసుకున్న అభిమానులు ఆయనని అందుకే జై బాలయ్య అని పొగిడేస్తుంటారు. ఇక అఖండ సక్సెస్ తో బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తున్నారు బాలయ్య . ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమాపై దృష్టి పెట్టనున్నారు. ఈ జనరేషన్ డైరెక్టర్లకు బాలయ్య అవకాశాలను ఇస్తున్న విషయంలో బాలయ్య అభిమానులు సైతం సంతోషంగా ఉన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…