Nagarjuna : ఇటీవలి కాలంలో టాలీవుడ్ వరుస విషాద సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతి రావు ఇలా సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కొద్ది రోజుల గ్యాప్‌తోనే కన్నుమూసారు. వారి మరణం సినీ అభిమానులకి తీరని విషాదాన్ని మిగిల్చింది. సినీ ప్రముఖులందరూ కూడా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి కన్నీటి వీడ్కోలు పలికారు..కానీ అక్కినేని నాగార్జున మాత్రం ఎవరి చివరి చూపు చూసేందుకు రాలేదు..ఇది ప్రస్తుతం ఆయనపై తీవ్రమైన విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి..అక్కినేని అభిమానులు సైతం నాగార్జున ఇలా చెయ్యడం పై సోషల్ మీడియా లో తప్పుబడుతున్నారు..
ముఖ్యమంత్రులే పనులు మానుకొని మరీ కృష్ణ వంటి లెజండరీ స్టార్స్ భౌతిక కాయాన్ని దర్శించుకొని నివాళులు అర్పిస్తుంటే నీకు హాజరవ్వడానికి ఏమి నొప్పి? అంటూ అభిమానులు ట్విట్టర్ లో నాగార్జున ని ట్యాగ్ చేసి తిడుతున్నారు. ఒకటి రెండు సార్లు అయితే బిజీగా ఉన్నారని అనుకోవచ్చు. ఇటీవల కాలంలో నాగార్జున ఏ చావు ఇంటికి వెళ్లడం లేదు. ఆయన కుమారులు నాగ చైతన్య, అఖిల్ మాత్రం విషాదాలు జరిగిన ఇంటికి వెళుతూ నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అయితే నాగార్జున ఎందుకు దూరంగా ఉంటున్నారు అనే దానిపై కొత్త చర్చ మొదలైంది. సాధారణంగాకొందరికి కొన్ని పట్టింపులు ఉంటాయి.
ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు కూడా జ్యోతిష్యులు, స్వామీజీలు చెడు జరిగిన ఇళ్లకు వెళ్ళకూడదు అని సూచిస్తారు. దీనితో నాగార్జున జ్యోతిష్యుల సలహా ఏమైనా పాటిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. బాలయ్యకి జ్యోతిష్యాలు, పూజలు, రాసులపై నమ్మకం ఎక్కువ . అయిన కూడా బాలయ్య మాత్రం విషాదాలు జరిగినప్పుడు వెళ్లి పరామర్శిస్తున్నారు. మరి నాగార్జున అంటీ ముట్టనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు. తనని విమర్శిస్తున్నా కూడా నాగార్జున చావు ఇంటికి ఏ మాత్రవ వెళ్లడం లేదు. దీనిపై స్పందించాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…