Anchor Suma : బుల్లితెర మహరాణిగా సుమ సృష్టించిన ప్రభంజనాలు అన్నీ ఇన్నీ కావు. నేటి యంగ్ యాంకర్ లకు సుమ ఒక డిక్షనరీలా మారిందనే చెప్పాలి.. ఇక సుమ కనకాల ఈవెంట్స్ లలో మైక్ పట్టుకుంటే అంతే. ఆమె మాటల ప్రవాహం, పంచ్ ల తూటాలకు నవ్వులు కురవాల్సిందే. తన మాటలలో ఎలాంటి ఎబెట్టు లేకుండా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. ఆమె సీరియల్స్, సినిమాలు అంటూ బిజీగా ఉన్నా కూడా యాంకర్ ద్వారా జనాలకు ఎక్కువ దగ్గరైంది. సుమ చేసిన షోలు, చేస్తూ ఉన్న షోలు అందరినీ అలరిస్తూ ఉంటాయి. ఆమె చేసిన ఎపిసోడ్స్ వేలకి వేలు సాగాయి. అలా సుమ రికార్డులు క్రియేట్ చేసింది. అయితే అలాంటి సుమ ఇప్పుడు బుల్లితెరకు దూరంగా ఉండబోతోన్నట్టుగా కనిపిస్తోంది.
సుమ యాంకరింగ్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటుంది యాంకర్ . ఇటీవలే యూట్యూబ్ లో తన పేరు మీద ఛానెల్ కూడా లాంఛ్ చేసి ఆ ఛానెల్ లో అన్ని రకాల ఎంటర్టైన్ మెంట్స్ ఇస్తూ మరింత ఫన్ చేస్తోంది. ఇప్పటికే పలు షోలతో బిజీగా ఉన్న యాంకర్ సుమ న్యూ ఇయర్ సందర్భంగా మరో ప్రోగ్రామ్ కి హోస్ట్ గా చేసింది. న్యూ ఇయర్ కు స్పెషల్ ఈవెంట్ గా వేర్ ఈజ్ ది పార్టీ పోగ్రామ్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో పలు సీరియల్ నటీనటులు పాల్గొన్నారు. వారితో మాట్లాడుతూ పంచ్ లేసింది సుమ కనకాల. తర్వాత హైపర్ ఆది వచ్చి సుమపై పంచ్ వేశాడు. సు.. అంటే సూడనివ్వదు, మ.. అంటే మాట్లాడనివ్వదు అని ఆది అనడంతో అందరూ నవ్వేశారు.
ఇక చివర్లో సుమకు అందరూ పూలమాలలు వేసి, శాలువాలు కప్పి సత్కరించారు. దాన్ని సుమ చాలా బాగా ఎంజాయ్ చేసింది. “మలయాళిగా పుట్టిన నేను ఇక్కడ సెటిల్ అయ్యానంటే అది కేవలం తెలుగు వాళ్లు ఇచ్చినటువంటి అభిమానం, ప్రేమ. మీరు లేకపోతే నేను లేను ఇది మాత్రం రాసిపెట్టుకోండి. కానీ కొంత విరామం అయితే తీసుకోవాలనుకుంటున్నాను” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుమ. యాంకరింగ్ కు పూర్తిగా గుడ్ బై చెప్పకుండా కాస్తా బ్రేక్ తో గుడ్ బై చెప్పనున్నట్లు ఆమె తెలిపింది. ఈ పోగ్రామ్ ను పూర్తిగా డిసెంబర్ 31 రాత్రి ప్రసారం చేయనున్నారు. దీంతో పూర్తి క్లారిటీ రానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…