Meena : ప్రస్తుతం ఏపీ మంత్రిగా ఉన్న రోజా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తలలోకి ఎక్కుతుంది. ప్రతిపక్షాలపై దారుణమైన విమర్శలు చేసే రోజాని టీడీపీ నేత ఆమెను అభ్యంతరకర రీతిలో దూషించిన విషయం తెలిసిందే.ఈ విషయంలో నటి ఖుష్బు, రాధిక శరత్ కుమార్, రమ్యక్రిష్ణ, మీనా వంటి వారు బండారు సత్యనారాయణమూర్తిని తీవ్రంగా తప్పుబట్టారు. సత్యనారాయణ వెంటనే మంత్రి రోజాకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మీనా ఓ వీడియో విడుతల చేసి మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ నీచమైన వ్యాఖ్యలు చేశారని.. అవి ఆమోదయోగ్యం కాదని అన్నారు.
బండారు సత్యనారాయణ వెంటనే రోజాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండారు చేసిన ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన దిగజారుడు మనస్తత్వం కలవారని ఈ వ్యాఖ్యలతో అర్థం అయిందని అన్నారు. అతని అభద్రత భావం, అసూయకి ఇవి నిదర్శనమని అన్నారు. నటిగా, తల్లిగా, పొలిటికల్ లీడర్‌గా, మహిళగా నిజ జీవితంలో అన్ని పాత్రల్లోనూ రోజా సక్సెస్ అయ్యారని మీనా అన్నారు. ఆమెపై ఇలా నీచంగా మాట్లాడితే రోజా భయపడబోరని, ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు బండారు సత్యనారాయణకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇలా మాట్లాడినంత మాత్రాన మహిళలు భయపడి పోతారు అనుకుంటున్నారా అని అన్నారు? మంత్రి రోజా చేసే పోరాటానికి తాను అండగా ఉంటానని మీనా మద్దతు పలికారు.
అయితే అప్పుడు మద్దతు ఇచ్చిన మీనా.. రేణూ దేశాయ్ గురించి చేసిన తప్పుడు వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించినట్టు తెలుస్తుంది. పవన్, రేణూ దేశాయ్‌ల వైవాహిక జీవితంపై రోజా కొన్ని తప్పుడు కామెంట్స్ చేయగా, వాటిపై మీనా ఫుల్ సీరియస్ అయినట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల కిందట ఓ ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ.. రోజాతో నాకు ఎక్కువగా పోటీ నడిచేది. డేట్స్ లేని కారణంగా నేను వదులుకున్న సినిమాలు తను, ఆమె వదిలేసిన సినిమాలు నేను చేస్తూ ఉండేవాళ్లం. ఇప్పటికీ వాళ్లందరితో నాకు మంచి స్నేహం ఉంది. నాకు ముందు నుంచి ఉన్న సీనియర్ హీరోయిన్స్ తోను స్నేహం కొనసాగుతూ ఉండటం నా అదృష్టం” అని చెప్పారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…