Ambati Rambabu : సంక్రాంతి వేళ మంత్రి అంబటి రాంబాబు చేసిన డాన్స్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. భోగి మంటల ముందు అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీశారు. సరిగ్గా గతేడాది సంక్రాంతి సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు పాత్రతో అలాంటి డ్రెస్సులో, అవే స్టెప్పులు వేయించి ట్రోల్ చేయడంతో మరోసారి అంబటి డ్యాన్స్ చర్చనీయాంశమైంది. ఇంత జరిగాక ఆయన ఈసారి భోగికి డ్యాన్స్ వేస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ మంత్రి మాత్రం తగ్గేదే లేదన్నారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈసారి కూడా మాస్ డ్యాన్స్ తో అదరగొట్టారు.
పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో భోగీ సెలబ్రేషన్స్ ఆకట్టుకున్నాయి. జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద సందడి నెలకొంది. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, భారీగా అంబటి నివాసానికి చేరుకున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత భోగి మంటల చుట్టూ డాన్స్ చేశారు అంబటి రాంబాబు. సత్తెనపల్లి సెంటర్‌లో లంబాడీ మహిళలతో కలిసి అంబటి డాన్స్ చేశారు. ప్రస్తుతం అంబటి రాంబాబు డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
గత ఏడాది భోగి మంటల ముందు అంబటి రాంబాబు డాన్స్ చేయగా, ఆయనని ఇమిటేట్ చేస్తూ బ్రో మూవీలో సీన్ చేశారు.. పబ్‌లో కూడా పృథ్వీ రాజ్ డాన్స్ చేస్తారు. టీ షర్ట్ కూడా అలానే ఉంటుంది. ఈ సీన్‌పై అప్పట్లో అంబటి రాంబాబు కూడా విమర్శలు గుప్పించారు. పెద్ద రాజకీయ వివాదమే నడిచింది. ప్రస్తుతం రాంబాబు డాన్స్‌తో పాటు ఆయన పాత ఫొటో కూడా ఒకటి వైరల్ అవుతోంది. అంబటి రాంబాబు సినిమాల్లో నటించిన ఫొటో సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. ఆయన సినిమాల్లో నటించారని.. దాదాపు ముప్పై ఏళ్ల క్రితం నాటి సినిమాగా సమాచారం.అంబటి నటించిన సినిమా పేరేంటో మాత్రం బయటపడడం లేదు. ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు నటించినట్లుగా తెలుస్తోంది. బీచ్ ఒడ్డున గుడిసెలో ఉండే ఒక పేద యువకుడి పాత్రలో ఒదిగిపోయినట్లుగా కనబడుతోంది. పక్కన హీరోయిన్ ఉండడంతో ఆయనది కీ రోల్ అని తెలుస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…