Mahesh Babu Sisters : గుంటూరు కారం చూసిన మ‌హేష్ వ‌దిన‌, ముగ్గురు సిస్ట‌ర్స్, ఫ్యామిలీ.. ఏమ‌న్నారంటే..!

Mahesh Babu Sisters : చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోగా పరిచయమై.. దాదాపు 25 ఏళ్లుగా సత్తా చాటుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను, అభిమానులని అల‌రిస్తున్నాడు. తాజాగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల‌ని ప‌ల‌క‌రించాడు.త్రివిక్రమ్ శ్రీనివాస్ – సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే ‘గుంటూరు కారం’. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు.

గుంటూరు కారం సినిమాకు నైజాంలో రూ. 42 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 46.25 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 20 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 132 కోట్లు బిజినెస్ జరిగింది. సినిమా రిలీజ్ రోజున హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ 35ఎంఎం థియేటర్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబ సభ్యులు నమ్రతాశిరోద్కర్, గౌతమ్ మరికొందరు కలిసి సినిమా చూశారు.

Mahesh Babu Sisters watched guntur karam movie know how is it
Mahesh Babu Sisters

మహేష్ బాబు ఫ్యామిలీతో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, వంశీ పైడిపల్లితో పాటు మరికొందరు చిత్ర యూనిట్ ఈసినిమాను అభిమానుల మధ్యలో కూర్చొని చూశారు. చాలా రోజుల తర్వాత మహేష్ ఊర మాస్ పాత్రలో నటించడంతో అభిమానులు థియేటర్లలో ఫైట్స్, డైలాగ్స్ కి ఈలలు వేస్తూ కేరింతలతో ర‌చ్చ చేస్తున్నారు. తాజాగా మ‌హేష్ బాబు న‌టించిన గుంటూరు కారం చిత్రాన్ని ఆయ‌న వ‌దిన‌, ముగ్గురు సిస్ట‌ర్స్ చూసి సినిమాలో మ‌హేష్ ప‌ర్‌ఫార్మెన్స్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌స్తుతం వారికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago