Manisha Koirala : నేపాలి బ్యూటీ మనీషా కోయిరాలా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. `భారతీయుడు`, `ఒకే ఒక్కడు` వంటి చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన మనీషా కొన్నాళ్లకి క్యాన్సర్ బారిన పడింది. ఆ తర్వాత కోలుకుంది. అయితే కోలుకున్న ఆమె రజనీకాంత్‌తో `బాబా` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ‘బాబా’ సినిమా ఆమె సౌత్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టింది అని చెప్పుకోవచ్చు. సూపర్ నేచురల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక డిజాస్టర్ కాగా, ఆ తర్వాత మనీషాకు అవకాశాలు రావడం మానేశాయి.
ఈ క్రమంలో మనీషా కోయిరాలా రజనీకాంత్ వల్లనే తన కెరీర్ నాశనం అయిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. `బాబా` నా చివరి చిత్రం, ఆది పరాజయం చెందడంతో నా కెరీర్ ముగిసినట్టే అనుకున్నా. ముందుగా ఊహించినట్టే జరిగింది. ఆ తర్వాత నాకు పెద్దగా అవకాశాలు రాలేదు . బాబా తర్వాత మూడేళ్లకి కమల్‌తో `ముంబయి ఎక్స్ ప్రెస్` చేసింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దీంతో సౌత్ నుంచి ఆఫర్లు రాలేదు. ఆల్మోస్ట్ సౌత్‌లో మనీషా కెరీర్ అయిపోయింది. ఇదే విషయాన్ని తాజాగా ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించింది.
తమిళంలో నటించిన తొలి చిత్రం `బాంబే` గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది మనీషా. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1995లో విడుదలై సంచలన విజయం సాధించగా, ఈ సినిమా గురించి మనీషా చెబుతూ, మొదట ఈ సినిమా చేయకూడదనున్నాను. తల్లి పాత్రలో నటిస్తే కెరీర్ దెబ్బతింటుందని అంతా హెచ్చరించారని, కానీ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా.. మణిరత్నం గురించి, ఆయన సినిమాల గురించి చెప్పారని, ఈ సినిమా వదిలేస్తే నీ అంతా పిచ్చి వాళ్లు ఉండరని తిట్టడంతో తాను ఒప్పుకుందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు అడపాదడపా హిందీ సినిమాలలో మెరుస్తుంది మనీషా.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…