Chiranjeevi : టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హహిట్ చిత్రాలలో నటించి మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి. తెలుగులో సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్,కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుల తర్వాత స్వయంకృషితో తన కంటూ ఒక సామ్రాజ్యాన్నే ఏర్పరుచుకున్నారు. ఈయన కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్‌తో పాటు అదే రేంజ్‌లో డిజాస్టర్స్ మూవీస్ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగాన్ని వదిలేసి సినిమాల వైపు రాగా, అతనికి గత వైభవం ఉంటుందా అన్న అనేక అనుమానాల మధ్య వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసి చిరు ఈజ్ బ్యాక్ అనేలా చేసింది.
ఖైదీ నెం150 సినిమా తర్వాత భారీ అంచనాలతో వచ్చిన సైరా నరసింహారెడ్డి చిత్రం నిర్మాతగా ఉన్న చరణ్ కు సుమారు రూ.30 కోట్ల వరకు నష్టం వచ్చింది. సైరాతో వచ్చిన వచ్చిన నష్టాలను కొరటాల తీసిన ఆచార్యతో లాభాలుగా మార్చాలని ఎంతో ప్లాన్ చేసినప్పటికీ ఆచార్య దారుణంగా పరాజయం పొందింది. ఆ తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య ఓ మోస్టరు విజయాన్ని అందుకున్నాయి. అయితే చిరు కెరీర్‌లో డిజాస్టర్‌గా వచ్చిన సినిమాలు చూస్తే అంజి.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 2004లో వచ్చినఈ సినిమా మెగాస్టార్ కి చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.
శంకర్ దాదా జిందాబాద్, మృగరాజు, బిగ్ బాస్, ఎస్పీ పరశురాం, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, లంకేశ్వరుడు, రాజా విక్రమార్క, యుద్ధ భూమి, చక్రవర్తి, ఆరాధన,త్రినేత్రుడు, కిరాతకుడు, జేబుదొంగ, రుద్ర నేత్ర వంటి చిత్రాలు చిరు కెరీర్‌లో భారీగా ఫ్లాపులుగా నిలిచాయి. చాణక్య శపథం, వేట, చిరంజీవి, ధైర్యవంతుడు, శివుడు శివుడు శివుడు, హీరో వంటి చిత్రాలు కూడా నష్టాల వలయంలో చిక్కుకొని బాక్సాఫీస్ వద్ద పూర్తిగా చతికిల పడ్డాయి. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ చిత్రంతో బిజీగా ఉండగా, ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…