Upasana : మెగా కోడలిగా, రామ్ చరణ్ భార్యగా ఉపాసన ఎంత మంచి పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్ళైన కొత్తలో ఎక్కువగా బయటకు, మీడియా ముందుకు రాకపోయినా ఇప్పుడు మాత్రం ఉపాసన రెగ్యులర్ గా ఏదో ఒక మంచి వార్తతోనే రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తూ వస్తుంది ఉపాసన. ప్రస్తుతం ఉపాసన ప్రగ్నెంట్ కూడా. చరణ్, ఉపాసన జంట ఇటీవల ఎక్కువగా ట్రిప్స్ కి వెళ్లడం, ఆర్ఆర్ఆర్ సినిమా విదేశీ ప్రమోషన్స్ నో ఉపాసన కూడా వెళ్లడంతో ఈ జంట బాగా వైరల్ అయ్యారు. ముంబైలో ఓ మీడియా ఇంటర్వ్యూలో చాలా విషయాలు గురించి ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
చిన్నప్పటి నుంచి నా విషయంలో ఎవరో ఒకరు జడ్జ్ చేసేవారు. శరీరాకృతి, బ్యాగ్రౌండ్ విషయాల్లో విమర్శలను ఎంతో ఫేస్ చేశాను. నేననే కాదు.. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో విమర్శలను ఫేస్ చేసే ఉంటారు. విమర్శలను మనం ఎలా తీసుకుంటున్నామనేది కూడా ముఖ్యం. విమర్శలు వచ్చినప్పుడు డీలా పడకూడదు. పదేళ్ల కాలంలో విమర్శలు చేసే వారికి నేనేంటో తెలిసింది. ఇప్పుడు నాపై వారి అభిప్రాయం మారింది. ఆ విమవర్శలను ఎలా ఎదుర్కొన్నానో నాకు తెలుసు. అందుకనే ఇప్పుడు నన్ను నేనొక చాంఫియన్‌లా అనుకుంటాను అని చెప్పిన ఉపాసన.. అదే సమయంలో పెళ్లి గురించి కూడా ఆమె మాట్లాడారు.
నాకు, రామ్ చరణ్‌కి మధ్య కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరం ప్రాక్టికల్‌గా ఆలోచిస్తుంటాం. వ్యక్తిగా తను ఏదో విషయంలో ఎప్పుడూ నాకు ఛాలెంజ్ విసిరేవాడు. నేను కూడా అంతే తనకు ఛాలెంజ్‌లను విసిరేదాన్ని. అలా ఎదుగుతున్న క్రమంలో మా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ‘ప్రేమలో పడటం కాదు.. ప్రేమలో వికసిస్తుంటావు’ అని చరణ్ నాతో అన్నాడు. తను చెప్పిన దాంట్లో నిజం ఉందనిపించి అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. మా ఇద్దరివీ భిన్నమైన నేపథ్యాలున్న కుటుంబాలు అయితే మా అంటీ, సోదరి మా పెళ్లి విషయంలో కీలక పాత్రను పోషించారు అని ఉపాసన కొణిదెల పేర్కొన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…