Manchu Vishnu : ఇటీవల జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమ వేదికపై అనూహ్య ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతున్న ప్రాంగణానికి చిరంజీవి రాగానే.. ఆయనతో, ఫొటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు పోటీపడ్డారు. అడిగిన వారందరికీ సెల్ఫీలు ఇస్తూ చిరంజీవి అక్కడే కాసేపు గడిపారు. అయితే, ఆ సమయంలో వేదికపై గరికపాటి.. ‘చిరంజీవి గారూ.. ఆ ఫొటో సెషన్ ఆపకపోతే, నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతా’ అని అన్నారు.అప్పుడు వేదికపై ఉన్నవారు గరికపాటికి సర్థి చెప్పారు. కాసేపటికే చిరంజీవి కూడా వేదికపైకి రావడంతో సభ సాగింది.
చిరంజీవిని ఉద్దేశిస్తూ గరికపాటి చేసిన కామెంట్స్ తీవ్రమైన చర్చకు దారి తీశాయి. మెగా అభిమానులు గరికపాటి తీరుని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. నాగబాబుతో పాటు పలువురు ప్రముఖులు కూడా దీనిపై స్పందించారు. తాజాగా ఈ ఇష్యూపై మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. తన జిన్నా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఆయన.. చిరంజీవి- గరికపాటి వివాదంపై ఆసక్తికరంగా స్పందించారు. అక్కడ ఏం జరిగిందో నాకు కరెక్ట్ గా అయితే తెలియదు కానీ.. చిరంజీవి, ఆయన ఫ్యాన్స్ అదీ ఇదీ అంటూ గరికపాటి ఏదో మాట్లాడినట్లు ఉన్నారు.
చిరంజీవి గారు ఒక లెజెండ్. అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు అభిమానులు ఫోటోలకు ఎగబడడం అనేది సహజంగా జరిగేదే. ఆ ఉత్సాహాన్ని కంట్రోల్ చేయడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. పెద్ద స్టార్స్ వస్తే ఇలాంటి సంఘటనలు కామన్ అని అన్నారు మంచు విష్ణు.అదే అలయ్ బలయ్ ఈవెంట్ లో చిరు మాట్లాడుతూ.. స్నేహానికి, ఓ చక్కని బంధానికి చిహ్నంగా జరుపుకునే ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఇలా స్నేహానికి చిహ్నంగా జరుపుకునే ఈ కార్యక్రమం తెలంగాణ కల్చర్‌లో ఉండడం ఈ గడ్డ గొప్పతనం అని అన్నారు. ఇక మంచు విష్ణు తాను నటిస్తున్న జిన్నా మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో విష్ణు సరసన సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…