Nayanthara : నయనతార, విఘ్నేష్ శివన్ కొన్నాళ్ల పాటు డేటింగ్‌లో ఉండగా, ఎట్టకేలకు జూన్‌లో వివాహం చేసుకున్నారు. జూన్ 9న పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట.. అక్టోబర్ 9న తమకు కవల పిల్లలు జన్మించారంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో వీరి సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారంటూ తెలుస్తోంది. అయితే ఇలా సరోగసి పద్దతిలో పిలల్లను కనడం అనేది వీరికి మరిన్ని ఇబ్బందులను తెచ్చి పెట్టింది. నయన్ తీరుపై సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా మండిపడుతున్నారు.
తమిళనాడు ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ అయింది. పెళ్లైన నాలుగు నెలలకె పిల్లలు ఎలా పుట్టారో వివరణ ఇవ్వాలంటూ ఇప్పటికే నయన్ దంపతులకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఇష్యూపై విచారణ జరిపిందుకు ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా నయన్ భర్త విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే నయన్, విగ్నేష్ జంటకి ఉచ్చు బిగుసుకునేలా ఉంది.
తాజాగా నయన్ విగ్నేష్ దంపతులు సరోగసి కేసుని ఎదుర్కొనేందుకు కొత్త ప్లాన్ తెరపైకి తెచ్చారు. ఆరేళ్ళ క్రితమే తాము వివాహం చేసుకున్నట్లు ప్రభుత్వానికి నయన్, విగ్నేష్ ఆధారాలు సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. సరోగసి విధానం పాటించాలంటే పెళ్లి జరిగి ఐదేళ్లు గడచి ఉండాలి. అలాగే అమ్మాయి వయసు 50 ఏళ్ల లోపు , అబ్బాయి వయస్సు 55 ఏళ్ల లోపు ఉండాలి. దీనితో నయనతార తాము ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు అధికారులకు ఆధారాలు చూపించారట. ఇటీవల జరిగింది సంప్రదాయబద్ధంగా జరిగింది అని చెప్పుకొచ్చారట. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. నయనతార విఘ్నేశ్ శివన్ దంపతులకు పెళ్లి అయిన క్షణం నుంచి ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. పెళ్లైన తరువాత తిరమలకు వెళ్లడం, అక్కడి మాఢ వీధుల్లో నయన్ చెప్పులతో నడవడం, గుడి ముందే రకరకాల ఫోటో షూట్లు చేయడంతో వివాదం రాజుకుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…