Nuvvu Naku Nachav : విక్టరీ వెంకటేష్ హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా కె.విజయ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’ . ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఇప్పటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి అందించిన సంభాషణలు అదిరిపోయాయి.. ‘శ్రీ స్రవంతి మూవీస్’ బ్యానర్ పై హీరో రామ్ పెదనాన్న శ్రీ స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. 2001 వ సంవత్సరం సెప్టెంబర్ 6న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చినా కూడా చిత్రాన్ని ఆదరిస్తుంటారు.
దేవిపుత్రుడు, ప్రేమతో రా..! వంటి వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న వెంకటేష్ ఈ సినిమాతో మళ్లీ పుల్ ఫామ్‌లోకి వచ్చాడు. చాలా మందికి తెలియని విషయమేమిటంటే ఈ చిత్రానికి ఫస్ట్ చాయిస్ వెంకటేష్ కాదట. తరుణ్‌తో తీయాలని అనుకున్నాడట విజయ భాస్కర్ . అయితే తరుణ్ ఇతర ప్రాజెక్ట్ కారణంగా రిజెక్ట్ చేశాడట. ఆ తరువాత వెంకటేష్‌ను హీరోగా తీసుకుని సినిమాను విడుదల చేయగా.. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదల తరువాత అనవసరంగా మంచి సినిమాను వదులుకున్నందుకు తరుణ్ కాస్త బాధపడ్డాడట. అప్పట్లో నువ్వు నాకు నచ్చావ్ సినిమా 57 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రానికి రూ.7.24 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.18.04 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే బయ్యర్లకు రూ.10.8 కోట్ల లాభాలు దక్కాయి. ‘దేవి పుత్రుడు’ ‘ప్రేమతో రా’ వంటి వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న విక్టరీ వెంకటేష్ కు మంచి హిట్ ను అందించి స్ట్రాంగ్ కంబ్యాక్ ను అందించి వెంకటేష్ కి ఫుల్ జోష్ అందించింది ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…