Indraja : అలనాటి అందాల తారలలో ఇంద్రజ ఒకరు. అందం, అభినయం ఉన్న ఈ నటి తెలుగులో టాప్ హీరోలందరి సరసన నటించిమెప్పించింది పెళ్లి చేసుకుని కొన్ని రోజుల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అలాగే కొన్ని టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జ్‌గా మొదట్లో అలరించిన ఇంద్రజ ఇప్పుడు జబర్ధస్త్ షో కి జడ్జ్‌గా ఉంది. ఇప్పుడు ఆమె ఈషోకి తీసుకునే రెమ్యునరేషన్ వైరల్‌గా మారింది.
గతంలో రోజా, నాగబాబులు ఒక్కో ఎపిసోడ్ కు రూ.5లక్షలు తీసుకుంటే ఇంద్రజకు కాస్త తక్కువే ఇస్తున్నారు. ఆమెకు ఒక్కో ఎపిసోడ్ కు 2 లక్షల 50 వేలు ఇస్తున్నారు. ఇదే రెమ్యునరేషన్‌ను శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా ఇస్తున్నారంట ఇంద్రజ క్రేజ్‌కి ఇది చాలా తక్కువ అని ఆమె అభిమానులు అంటున్నారు. అయితే ఇంద్రజకి ఆ స్థానం రోజా వలనే దక్కింది. జబర్దస్త్ జడ్జ్‌గా కొన్నేళ్ల పాటు సేవలందించింది రోజా. ఓ వైపు రాజకీయాల్లో భాగమవుతూనే వారం వారం కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్‌తో ప్రతి ఇంటి గడప తొక్కేది. అయితే ఆమెకు మంత్రి పదవి రావడంతో రీసెంట్‌గా ఈ షో నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో ఇంద్రజ వచ్చి చేరింది.
రోజా వస్తే.. జబర్దస్త్ జడ్జ్ సీటు నుంచి లేచి వెళ్ళిపోతా అనేసింది ఇంద్రజ. జబర్దస్త్ వేదికపై రోజా గారు తొమ్మిదేళ్లుగా ఒక లెగసీ క్రియేట్ చేశారని, ఆ తర్వాత మంత్రిగా అవకాశం రావడంతో వెళ్లారని చెప్పింది ఇంద్రజ. ఇక ఇంద్రజ భర్త పేరు మహ్మద్ అబ్సర్. అతను ఓ ముస్లిం అబ్బాయి. 2006లో వీరి వివాహమైంది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరి మధ్య స్నేహం చిగురించి.. ఆతర్వాత ప్రేమగా మారింది. ఆపై ఇరు కుటుంబ సభ్యులు, పెద్దల ఆశీర్వాదంతో పెళ్లిపీటలెక్కారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…