Manchu Manoj : మంచు మోహన్ బాబు నట వారసుడు మంచు మనోజ్ కొన్నాళ్లుగా సినిమాలకు చాలా దూరంగా ఉన్నారు. గతంలో `అహం బ్రహ్మాస్మి` చిత్రాన్ని ప్రకటించగా, ఇది ఆగిపోయిందని అప్పట్లో తెలిపారు. అయితే ఆయన ఈ సినిమాని స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అలాగే కొత్త సినిమాని కూడా ఆయన ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. ఇకపై వరుసగా సినిమాలు చేయాలని భావిస్తుండగా, మరోవైపు వైపు కొత్త జీవితం కూడా ప్రారంభించాలని అనుకుంటున్నాడట. తాజాగా కడప జిల్లాలో ఫేమస్ అయిన కడప దర్గాను సందర్శించిన ఆయన మంచు మనోజ్ అక్కడ కూడా తన పెళ్లి గురించి పరోక్షంగా కామెంట్స్ చేశారు.
చాలాకాలం నుంచి కడప దర్గా దర్శించుకోవాలని అనుకుంటున్నాననీ తెలిపిన మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ ఈ దర్గాకి వచ్చినా తాను ఇక్కడికి రావడానికి ఎందుకో సమయం పట్టిందని ఆ అల్లా ఇప్పుడు తనను ఇక్కడికి పిలిపించుకున్నారని మంచు మనోజ్ పేర్కొన్నారు. అంతేకాక త్వరలోనే తన సినిమాలు ప్రారంభమవుతున్నాయని, అలాగే కొత్త జీవితం కూడా ప్రారంభిస్తున్నామని ఆయన పేర్కొనడంతో త్వరలో మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం జోరందుకుంది.
మంచు మనోజ్ మొదటి భార్య ప్రణతిని 2015లో చేసుకోగా, అనివార్య కారణాల వలన 2019లో విడిపోయారు. అయితే ఇటీవల మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికా రెడ్డితో సహజీవనం చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. వినాయక చవితి సందర్భంగా భూమా కుటుంబానికి చెందిన భూమా మౌనికతో కలిసి కనిపించిన ఆయన కొత్త చర్చకు తావిచ్ఛారు. భూమా మౌనిక గతంలో వేరే వ్యక్తిని వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నారు. మంచు మనోజ్ కూడా అలాగే వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. త్వరలో ఈ ఇద్దరు రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…