Athadu Deepak : కొందరు బాల నటులు చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులలో మాత్రం మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలా అతడు సినిమాలో నటించిన ఓ కుర్రాడు ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2005 ప్రాంతంలో చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేయగా, ఇప్పుడు పాపులారిటీ కోసం పాకులాడుతున్నాడు. ఇక ఆ కుర్రాడి పేరు దీపక్ కాగా, అతడు సినిమాలో బ్రహ్మానందం కొడుకు పాత్రలో నటించాడు. నాన్నా ట్రైన్ తీసుకురమ్మన్నా.. తెచ్చావా అంటూ అని బ్రహ్మిని అడిగితే.. ఆ తెచ్చాన్రా పట్టాల మీదుంది వెళ్లి తెచ్చుకో అంటాడు కదా..!
ఇక ఆ తర్వాత భద్ర సినిమాలో అన్నయ్య సాంబార్‌లో చికెన్ వేసుకో బాగుంటుంది అని.. ఓ బుడ్డోడికి చిన్నది చెప్తుంది.. ఆ బుడ్డోడు ఇప్పుడు సినిమాల్లోకి రావడానికి ట్రై చేస్తున్నాడు.చైల్డ్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటిన దీపక్ యవ్వనంలోకి రాగానే హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. హీరోగా తొలిసినిమా బంధనం మూవీతో పరిచయం కాగా, ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయినా.. దీపక్ నటనకు మంచి పేరు తెచ్చింది. దీని తర్వాత కూడా మరిన్ని సినిమాలు చేసేందుకు అతను ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. గత బిగ్ బాస్-5 సీజన్ లో కూడా అతను పాల్గొంటాడని టాక్ వచ్చినా.. ఎందుకో అతను పాల్గొనలేదు.
ఇక ప్రస్తుతం సినిమాలపైనే తన పూర్తి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్టులు గతంలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోలుగా మారారు. ఈ క్రమంలోనే దీపక్ కూడా మంచి హీరో కావాలని అనుకుంటున్నాడు. ఇతను ఆర్య, లెజెండ్, పెద్దబాబు, ఆంధ్రుడు, భద్ర సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మిణుగురులు అనే అద్భుత సినిమాలో కీరోల్ ప్లే చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా 20 సినిమాలకు పైగా నటించిన ఇతగాడు.. ఆ తరువాత చదువు కోసం కొంత గ్యాప్ తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం హీరోలకు ఏ మాత్రం తక్కువ కాని ఫిజిక్‌తో బాగానే రెడీ అయ్యాడు. సోషల్ మీడియాలో ఈ కుర్రాడు స్పెషల్ ఫోటోషూట్స్ చేస్తూ అలరిస్తున్నాడు. సినిమాలతో పాటు మోడలింగ్ వైపు కూడా అడుగులు వేస్తున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…