Manchu Lakshmi : మోహన్ బాబు తనయ మంచు లక్ష్మీ నటిగా, హోస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. చాలా కాలం అమెరికాలో ఉన్న మంచు లక్ష్మి అమెరికన్ టెలివిజన్ షోస్ హోస్ట్ గా వ్యవహరించడంతో పాటు పలు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించింది. ఇక టాలీవుడ్ ని దున్నేద్దామని హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యింది. బ్రదర్స్ మాదిరి మంచు లక్ష్మికి కూడా కాలం కలిసిరాలేదు. ఏదో అడపాదడపా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఎప్పటికప్పుడు సరికొత్త పోస్ట్‌లు పెడుతూ నెటిజన్స్ కి మంచి వినోదం పంచుతూ ఉంటుంది.
మంచు లక్ష్మీ నటిగా హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా పలు సినిమాలు చేస్తూ వస్తోంది. ఇటీవలే రిలీజ్ అయిన మాన్స్టర్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించింది. ఇక పవన్ కళ్యాణ్ పై ట్రోలక్ కి సంబంధించిన పోస్ట్ ని తన సోషల్ మీడియాలోషేర్ చేస్తూ.. మంచో చెడో పవన్ కళ్యాణ్ నా పక్కన ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ కామెంట్ చేసింది. ఇక రీసెంట్‌గా మంచు లక్ష్మీ జీవితంలో చాలా పెద్ద తప్పులు చేశానంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. కి ఇప్పుడు ఒరిజినల్ రెజ్లింగ్ బెల్ట్ ఒకటి ధరించిన ఫోటోలను షేర్ చేసింది.
“నా మిషన్ కేవలం మనుగడ సాధించడమే కాదు, అభివృద్ధి చెందడం కూడా. మరియు అలా చేయడానికి కొంత అభిరుచి, కొంత కరుణ, కొంత హాస్యం, కొంత స్టైల్ కలిగి ఉండాలి” అని ప్రముఖ అమెరికన్ రచయిత్రి మాయ ఏంజెలౌ సూక్తిని తన ట్వీట్‌లో రాసుకొచ్చి పోస్ట్ పెట్టింది మంచు లక్ష్మీ.మహిళలు స్ట్రాంగ్ గా ఉండాలని, మనుగడ సాధించడం మాత్రమే కాదు.. మహిళలు అభివృద్ధి చెందాలనే విషయం కూడా చెప్పుకొచ్చింది. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి అన్న విషయాన్ని ఆమె ఈ పోస్ట్ తో చెప్పుకొచ్చినట్టు అర్ధమవుతుంది. అయితే ఒరిజినల్ రెజ్లింగ్ బెల్ట్ ఆమె దగ్గరకు ఎలా వచ్చిందో? అని నెటిజన్స్ ఆలోచనలో పడ్డారు. ఏదైనా రెజ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా లేదా వెబ్ సిరీస్ చేస్తున్నారా? అందులో మంచు లక్ష్మి రెజ్లర్ గా నటిస్తున్నారా? లేక నిజంగానే రెజ్లింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారా? ఇలా పలు అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…