Valliddari Madhya Movie : ఇటీవలి కాలంలో ఓటీటీలో వైవిధ్యమైన సినిమాలు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ‘ఆహా’ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చే సినిమాలను పరిశీలిస్తే, లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథలకు వారు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. తాజాగా వాళిద్దరి మధ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇరు కుటుంబాల నేపథ్యంలో ఆ ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుందనేది ప్రధానమైన అంశంగా ఈ చిత్రాన్ని తెరెక్కించగా, వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించాడు.
కథ:
బీటెక్ గ్రాడ్యుయేట్ అయితన వరుణ్ ఒక కారణంగా ఉద్యోగం చేయడం ఇష్టం లేక సొంతంగా అన్వయ అనే కంపెనీ ప్రారంభించి బిజినెస్ మొదలుపెడుతాడు. అమెరికాలో ఉండే అన్వయ అనే అమ్మాయి (నేహా కృష్ణ) తల్లిదండ్రులు వరుణ్‌కు క్లయింట్స్‌గా ఉంటారు. అయితే అన్వయ ఇంటికి వెళ్లిన వరుణ్ తొలి చూపులోనే ఆమెను చూసి ప్రేమలో పడతాడు. అయితే అమెరికాలో ప్రేమ బ్రేకప్ కావడంతో అన్వయ ఇండియాకు వచ్చిందని వరుణ్‌కు తెలుసుకున్నా కూడా అన్వయను ప్రేమిస్తుంటాడు. అయితే వాళ్లిద్దరు పెళ్లి చేసుకొంటారనే సందర్భంలో వారిద్దరి మధ్య అపార్ధాలు చోటుచేసుకొంటాయి. వాటిని ఇద్దరు పరిష్కరించుకొని ఒక్కటయ్యారా లేదా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
పర్‌ఫార్మెన్స్
వరుణ్‌గా విరాజ్ అశ్విన్ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. కానీ ఆ కథను, తన పాత్రను మరో లెవెల్‌కు తీసుకెళ్లలేకపోయాడనిపిస్తుంది. నేహా కూడా కొన్ని సీన్లలో ఒకే అనిపించింది. నేహా తండ్రిగా శ్రీనివాస్ వడ్లమాని కామెడీ పెద్దగా వర్కవుట్ అయినట్టు లేదు. ఇక విరాజ్ అశ్విన్ తండ్రిగా వెంకట్ సిదారెడ్డి ఆ పాత్రకు బ్యాడ్ ఛాయిస్. మిగితా పాత్రల్లో కనిపించినవారు ఒకే అనిపించారు.
మనసంతా నువ్వే, నేనున్నాను లాంటి భారీ విజయాలను అందుకొన్న వీఎన్ ఆదిత్య ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోయిన ఆయన చాలా గ్యాప్ తర్వాత ఇగో అనే అంశంతో.. ఆత్మల బ్యాక్ డ్రాప్‌తో ఒక డిఫరెంట్ పాయింట్‌తో లవ్ స్టోరిని అటెంప్ట్ చేసాడు. అయితే చాలా సెన్సిటివ్ పాయింట్‌ను ఎమోషనల్‌గా క్యారీ చేయడానికి సరైనా హీరో, హీరోయిన్లు లేకపోవడం చిత్రానికి పత్రికూలమైన పాయింట్‌గా మారింది. 135 నిమిషాల డ్యూరేషన్ కాబట్టి స్క్రీన్ ప్లే, సీన్స్ అన్నీ కూడా సాగదీసినట్లు అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. 135 నిమిషాల డ్యూరేషన్ కాబట్టి స్క్రీన్ ప్లే, సీన్స్ అన్నీ కూడా సాగదీసినట్లు అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా రొటీన్ గానే అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
మైనస్ పాయింట్స్:
చివరిగా..
‘మనసంతా నువ్వే’ .. ‘నేనున్నాను’ వంటి హిట్స్ ఇచ్చిన వీఎన్ ఆదిత్య నుంచి ఇలాంటి ఒక సినిమా వస్తుందని ఎవరూ అనుకోరు. ప్రతిసారి అటు హీరోలో నుంచి .. ఇటు హీరోయిన్ లో నుంచి ‘లోపలి మనిషి’ బయటికి వచ్చేస్తుంటాడు. దాంతో ఇద్దరు హీరోలను .. ఇద్దరు హీరోయిన్లను చూడవలసి వస్తుంది. కథాకథనాల్లో కొత్తదనం ఏదైనా ఉంటే ఈ నలుగురినీ భరించవచ్చు .. కానీ అదెక్కడా మచ్చుకి కూడా మనకి కనిపించకపోవడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టే అయింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…