Manchu Lakshmi : సోషల్ మీడియాలో మెగా – మంచు అభిమానుల మధ్య తరచుగా మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. రెండు ఫ్యామిలీలు సన్నిహితంగా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ.. మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత మాత్రం పరిస్థితులు పూర్తిగా మారాయి. మెగా వెర్సెస్ మంచు అనే విధంగా తయారయ్యాయి. అప్పటి నుంచీ ఎప్పుడూ ఏదొక విషయంపై ఇరు వర్గాలు ట్రోలింగ్ చేసుకుంటూ వస్తున్నారు. సన్ ఆఫ్ ఇండియా సినిమా ఫ్లాప్ అయినప్పుడు మెగా ఫ్యాన్స్ తెగ ట్రోలింగ్ చేయగా, ఆచార్య సక్సెస్ పొందనప్పుడు మంచు ఫ్యామిలీ అభిమానులు రెచ్చిపోయి విమర్శలు చేశారు.
అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి పాటకి మంచు లక్ష్మీ స్టెప్పులు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చిరంజీవి నటించిన మాస్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుండి మాంచి ఊపున్న ‘బాస్ పార్టీ’ సాంగ్ రిలీజ్ చేశారు. సినీ సెలెబ్రిటీలు సైతం ఈ సాంగ్‌కి స్టెప్‌లు వేస్తున్నారు. తాజాగా నటి మంచు లక్ష్మి .. జబర్దస్త్ ఫేమ్ మహేష్‌తో కలిసి ఈ ‘బాస్ పార్టీ’ సాంగ్‌కి స్టెప్‌లు వేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో మంచు లక్ష్మి.. మెగాస్టార్ పాటలకి డ్యాన్స్ చేయడం ఎప్పుడూ సంతోషమే అంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ శృతి హాసన్ నటిస్తోంది. అలానే మాస్ మహరాజా రవితేజ కూడా ఓ కీలక పాత్ర చేశాడు.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవి ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ మేరకు పాటలు కూడా మాస్ ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా రూపొందించారు. ఇప్పటికే మూడు పాటలు విడుదల అవగా.. పాటలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ‘బాస్ పార్టీ’ సాంగ్ సాంగ్ లిరిక్స్ రిలీజ్ చేయగానే.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ ఈ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా డ్యాన్స్ చేయగా.. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ అభిమానుల్ని కట్టిపడేయడంతో ఈ పాట అంతటా రచ్చ చేస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…