Manasantha Nuvve : 2001లో ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా నటించిన మనసంతా నువ్వే సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఉదయ్ కిరణ్ కెరీర్ లో మూడువ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ఆ తరువాత వరుస సినిమా అవకాశాలు అందుకున్నాడు ఉదయ్ కిరణ్. మనసంతా నువ్వే సినిమాలో కథ పరంగా ఉదయ్ కిరణ్ రీమాసేన్ చిన్నతనం నుంచి ప్రేమించుకుంటారు. ఆ తరువాత కొన్ని కారణాల వలన విడిపోతారు. ఈ విధమైన కొత్త కథాంశంతో వచ్చిన మనసంతా నువ్వే చిత్రం అప్పటిలో ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయాన్ని సాధించింది.
మనసంతా నువ్వే చిత్రానికి ఉదయ్ కిరణ్ ని హీరోగా తీసుకోవడానికి తెర వెనక ఎంతో కథ జరిగింది. ఈ చిత్రాన్ని ఎమ్.ఎస్ రాజు నిర్మించగా, వి.ఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఇక యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్న ఎమ్.ఎస్ రాజుకి ఓ కెమెరామెన్ వి.ఎన్ ఆదిత్య గురించి చెప్పాడు. దాంతో ఎమ్.ఎస్ రాజు వి.ఎన్ ఆదిత్యకు ఫోన్ చేశాడట. కానీ ఆయన రెస్పాన్స్ అవ్వటం లేదని మరుసటి రోజు ఎమ్.ఎస్ రాజు మరోసారి ఫోన్ చేశారు. ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేయగా ఓ సారి వచ్చి కలుస్తావా అని అడిగారట రాజు. దాంతో వి.ఎన్ ఆదిత్య సారీ సార్ నేను రాజమండ్రి గుడిలో పూజ చేయించుకోవడానికి వెళుతున్నా అని అన్నారట. ఆ తరవాత వారం రోజులు వి.ఎన్ ఆదిత్య కోసం ఎదురుచూసినా కూడా ఆయన రాలేదు.
ఇక చివరగా మరోసారి ఎం.ఎస్ రాజు ఫోన్ చేద్దామనుకున్నారట ఎమ్.ఎస్ రాజు. ఇక చివరి కాల్ తో వి.ఎన్ ఆదిత్య సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ఆఫీసుకు వచ్చాడు. వి.ఎన్ ఆదిత్య మాట్లాడుతూ నేను లవ్ స్టోరీతోనే ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పారట. సరే అని చెప్పిన ఎమ్ ఎస్ రాజు రెండు కథలను వి.ఎన్ ఆదిత్యకు వినిపించారు. ఇది హిందీలో వచ్చిన అన్ముల్ గడి అనే సినిమా కథను బేస్ చేసుకుని ఓ కథను డెవలప్ చేశారు. ఇక ఈ సినిమాకు మనసంతా నువ్వే అనే టైటిల్ ను ఫైనల్ చేశారు ఎమ్.ఎస్ రాజు.
ఇక ఈ సినిమాలో మొదటిగా హీరో మహేశ్ బాబును తీసుకోవాలని ఎమ్.ఎస్ రాజు అనుకున్నారు. కానీ వి.ఎన్ ఆదిత్య మాత్రం కొత్త కుర్రాడితో సినిమా చేయాలని అనుకున్నారట. ఎం.ఎస్ రాజు కొత్త కుర్రాడు ఎక్కడ దొరుకుతాడు అని అడగ్గా.. వి.ఎన్ ఆదిత్య చిత్రం సినిమాతో పరిచయమైన ఉదయ్ కిరణ్ గురించి చెప్పడం జరిగిందట. దాంతో ఎమ్.ఎస్ రాజు చిత్రం సినిమా చూసి ఉదయ్ కిరణ్ ను ఈ కుర్రాడు కరెక్ట్ గా కథకు సెట్ అవుతాడని ఫైనల్ చేశాడు. ఇంత తతంగం జరిగిన తర్వాత ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…