OTT : గత కొద్ది నెలలుగా టాలీవుడ్ సినీ పరిశ్రమ స్తంభించినట్టు అయింది. సినీ ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్లడమే మానేశారు. అందుకు కారణం మంచి సినిమాలు రాకపోవడం, అదీ కాక సినీ పరిశ్రమలో గొడవల వలన కొద్దిగా ప్రేక్షకులు కూడా డిస్ట్రబ్ అయ్యారు. అయితే ఇండస్ట్రీకి ఆగస్టు నెల ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అదే ఊపుతో సెప్టెంబర్ మొదటి వారంలో పలు యంగ్ హీరోల సినిమాలు థియేటర్లలోకి అడుగపెట్టాయి. ఇందులో కొన్ని అలరించగా, మరి కొన్ని నిరాశపరిచాయి. అయితే ఈవారం కూడా కొన్ని వైవిధ్యమైన సినిమాలు ఆడియెన్స్ ముందుకు వస్తున్నాయి.
వీటితో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లూ సిద్ధమయ్యాయి. మరి సెప్టెంబర్ రెండో వారంలో అటు థియేటర్లలో ఇటు ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ లేంటో ఓ లుక్కేద్దామా. సినిమాల విషయానికి వస్తే నేను మీకు బాగా కావల్సిన వాడిని చిత్రం సెప్టెంబర్ 16న విడుదల కానుంది. శాకిని డాకిని, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు కూడా సెప్టెంబర్ 16న థియేటర్స్‌లో సందడి చేయబోతున్నాయి.
ఇక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ విషయానికి వస్తే.. రవితేజ హీరోగా, మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌషిక్ హీరోయిన్ గా నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం థియటర్స్ లో విడుదలై అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15 నుండి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో జీవితం ఆధారంగా రూపొందిన బ్లాండే మూవీ సెప్టెంబర్ 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవబోతుంది. అనా డే అర్మాస్ ఈ మూవీలో మార్లిన్ మన్రో పాత్రలో నటించింది.
ఇక సోనీ లివ్ హిట్ సిరీస్, కాలేజ్ రొమాన్స్ మూడవ సీజన్ ఈ నెల 16 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ నటుడు దిల్జిత్ దోసంజ్ ప్రధాన పాత్రలో నటించిన జోగీ అనే సినిమా కూడా సెప్టెంబర్ 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో ప్రదర్శితం కానుంది. 1980ల నాటి సిక్కు అల్లర్ల నేపథ్యంలో సామాజిక కోణంలో ఈ చిత్రం సాగనుంది. అటెన్షన్ ప్లీజ్ అనే చిత్రం కూడా సెప్టెంబర్ 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో సందడి చేయనుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…