Liger Movie : వరుస ఫ్లాఫులతో సతమతం అవుతున్న విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి రావాలని అనుకున్నాడు. కానీ ఈ చిత్రం కూడా దారుణమైన నిరాశని మిగిల్చింది. ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకోగా అవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా గత నెల 25న విడుదల కాగా భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో విజయ్ – పూరీ కాంబినేషన్‌లో పట్టాలెక్కనున్న జనగణమనకి కూడా బ్రేకులు పడ్డాయి.
అయితే లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలలో కూరుకుపోయినట్టు తెలుస్తుంది. ఆ నష్టాలను పూడ్చేందుకు పూరీ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక లైగర్ చిత్రం ఓటీటీలో రాబోతుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబరు 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా లైగర్ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే అనుకున్నదానికంటే నాలుగు వారాల ముందుగానే సినిమా ఓటీటీలోకి అందుబాటులో రానుంది.
ఇటీవల తెలుగు నిర్మాతల మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఏ సినిమా అయినా థియేటర్లలో రిలీజైన 8 వారాల వరకు ఓటీటీలో విడుదల చేయకూడదు. కానీ లైగర్ విషయంలో ముందుగానే మేకర్స్.. డీల్ కుదుర్చుకున్నారట. దాంతో సెప్టెంబర్ 22న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారట. ఇక ఈ చిత్రంలో రమ్య కృష్ణ ఇందులో రౌడీ హీరోకు తల్లి పాత్రలో కనిపించింది. అనన్య పాండే హీరోయిన్ కాగా.. రోనిత్ రాయ్ విజయ్‌కు కోచ్ పాత్రలో కనిపించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…