Liger And Agent : ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఏజెంట్. ఈ మూవీ అఖిల్ కెరీర్‌లోనే చెత్త సినిమాగా మిగిలింది.ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడు. సినిమా హిట్ పక్కా అని భావిస్తున్న సమయంలో చిత్రం పెద్ద ఫ్లాప్‌గా మిగిలింది. ఈ నేపథ్యంలో ఏజెంట్, లైగర్ ఫ్లాప్ కావడానికి ఒక రీజన్ ఉందని చెబుతున్నారు. సాధారణంగా కథ, కథనం లేకుండా కేవలం యాక్షన్, హీరోయిజాన్ని నమ్ముకుని సినిమాలు చేస్తే ఆడవనే విషయం తెలిసిందే. లైగర్, ఏజెంట్ అలానే దెబ్బ కొట్టాయి. లైగర్ ఓపెనింగ్స్ పరంగా కొంచెం బాగానే రాబట్టినప్పటికీ, ఏజెంట్ కి అవి కూడా రాలేదు.
అయితే ఏజెంట్, లైగర్ ఫ్లాప్ కావడానికి ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉందని అంటున్నారు. దాని వలనే ఈ చిత్రాలు ప్లాప్ అయ్యాయట. అదేంటంటే ‘సాలా’ అనే హిందీ పదం. ఈ రెండు చిత్రాల్లో సాలా అనే పదం ఉపయోగించారు. అందుకే నెగిటివ్ రిజల్ట్ వచ్చిందని చెబుతున్నారు. . సాలా అంటే బామ్మర్ది అని అర్థం. దీన్ని బూతుగా కూడా వాడతారు. చాలా మందికి ఊతపదం కూడా. మాస్ అప్పీల్ ఉంటుంది. అందుకే ఓ వర్గం ప్రేక్షకులకు ఆ పదం కనెక్ట్ అవుతుంది. అయితే దర్శకుడు పూరి జగన్నాధ్ చిత్రాలన్నీ మాఫియా, క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటాయి కాబట్టి ఈ పదం తప్పక వాడతారు.
లైగర్ సినిమాలో కూడా సాలా అనే పదం విజయ్ దేవరకొండ వాడగా, ఏజెంట్‌లో అఖిల్ కూడా వాడాడు. అయితే అఖిల్ కి ఇది కలిసిరాలేదని, అందుకే వారి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయని అంటున్నారు. ఇది వినడానికి సిల్లీగా ఉంది. అయితే పరిశ్రమలో సెంటిమెంట్స్ ని బాగా ఫాలో అవుతారు కాబట్టి ఈ విషయాన్ని కొందరు పాయింట్ అవుట్ చేస్తున్నారు. మరి కొందరు అభిమానులు కాంబినేషన్స్, టైటిల్స్, విడుదల తేదీల విషయంలో కొన్ని విషయాలను గుడ్డిగా నమ్ముతారు. ఏది ఏమైన కూడా విజయ్ దేవరకొండ, అఖిల్‌లకి రెండు సినిమాలు పెద్ద అపజయాలు అందించాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…