Ram Charan : కొత్త యాస నేర్చుకోబోతున్న రామ్ చ‌ర‌ణ్‌.. ఎందుకంటే..!

Ram Charan : మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌రణ్ ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత చేస్తున్న చిత్రం గేమ్ చేంజ‌ర్. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌రవేగంగా జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తున్నారు. కొన్నాళ్లు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన టీమ్ ఇక షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది.. ఇక ఈ సినిమా పూర్తైన త‌ర్వాత‌ రామ్ చరణ్ తన 16 వ సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమాను కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా అని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ పై రామ్ చ‌ర‌ణ్ చాలా గట్టి నమ్మకం తో ఉన్నారు. ఈ చిత్రం గురించి ఇప్పటికే రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్‌ అని పేర్కొన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడనున్నాడని తెలుస్తుంది. అందుకోసం చరణ్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నాడని తెలుస్తోంది. అతను తన బాడీ లాంగ్వేజ్‌పై కూడా ఫోకస్ చేయనున్నారు. అయితే డైరెక్టర్ బుచ్చిబాబు రంగస్థలం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ గా పనిచేశాడు. చరణ్ నుండి బెస్ట్ వర్క్ ను పొందడానికి ఆ అనుభవం కూడా ఉపయోగపడుతుంది అని చెప్పాలి. రంగ‌స్థ‌లంలో త‌న యాస‌తో అద‌ర‌గొట్టిన చ‌ర‌ణ్ ఇప్పుడు బుచ్చిబాబు సినిమాలోను త‌న స‌త్తా చూపించ‌బోతున్నాడ‌ని అంటున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Ram Charan to learn new slang for his film
Ram Charan

ఇక ఈ సినిమా నవంబర్‌లో మొదలుకానుందని తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. సినిమాలో హీరోయిన్, ఇతర టెక్నికల్ విషయాలను త్వరలో ప్రకటించనుంది టీమ్. ఇక రామ్ చ‌ర‌ణ్ త్వ‌ర‌లో తండ్రి కాబోతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు అమ్మాయే పుడ‌తారంటూ జోస్యాలు చెబుతున్నారు. ఇటీవల గ్రాండ్ గా జరిగిన ఉపాసన సీమంతం వేడుకల్లో పింక్ కలర్ హైలెట్ అయింది. ఉపాసన కూడా పింక్ కలర్ డ్రస్ లో కనిపించింది.. పింక్ కలర్ అమ్మాయిలకు సంకేతం. దీంతో రామ్ చరణ్ దంపతులకు పుట్టబోయేది అమ్మాయినే అన్న చర్చ ఇటు ఇండస్ట్రీలోనూ, అటు సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago