IPL 2023 : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ మరోసారి మైదానంలో గొడవపడ్డారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో లక్నోపై ఆర్‌సీబీ 18 పరుగుల తేడాతో గెలుపొందగా, మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న సమయంలో గంభీర్-కోహ్లీ మధ్య చి్న్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. వారిద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీయడంతో సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకొని గొడవ సద్దుమణిగేలా చేశారు.
సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నో బ్యాటింగ్ చేస్తున్నంత సేపు.. కోహ్లీ చాలా ఆగ్రహంగా సంబరాలు జరుపుకున్నాడు. అయితే ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ కవ్వింపు చర్యలకి తాజా మ్యాచ్‌లో విరాట్ బదులిచ్చే ప్రయత్నం చేశాడు. లక్నో ప్లేయర్ కైల్ మేయర్స్‌తో కోహ్లీ మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన గంభీర్, అతనితో మాట్లాడకని సైగ చేసి అతడిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అప్పుడు కోహ్లీ స్పందించడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి చిన్నపాటి గొడవ జరిగింది. అమిత్ మిశ్రాతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో పాటు లక్నో టీమ్ ప్లేయర్లంతా కలిసి విరాట్ కోహ్లీకి సర్ది చెప్పి, అతన్ని వెనక్కి పంపించారు.
అయితే అసలు ఈ గొడవకి కారణం.. బెంగళూరులో ఆర్‌సీబీని 1 వికెట్ తేడాతో ఓడించింది లక్నో. ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి లక్నో గెలవగానే గౌతమ్ గంభీర్, ఆర్‌సీబీ అభిమానుల వైపు నోరు మూసుకోవాల్సిందిగా సైగలు చేశాడు. విజయం మాదని గర్వం ప్రదర్శించాడు. అప్పట్లో ఈ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇది మనుసులో పెట్టుకున్న విరాట్ దీనికి ప్రతీకారంగానే తాజా మ్యాచ్‌లో రెండు క్యాచులు అందుకున్నాక అగ్రెసివ్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఏది ఏమైన కోహ్లి ఈ పని చేసిన కాసేపటికే గంభీర్ ట్విట్టర్లో ట్రెండింగ్‌గా నిలవడం గమనార్హం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…