Ashwini Dutt : కొద్ది రోజులుగా సినిమా పరిశ్రమతో ఏపీ ప్రభుత్వం ఫైట్ చేస్తుంది. టిక్కెట్ రేట్స్ పెంచే విషయంలో అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమమే నడిచింది. అయితే ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమని చిన్న చూపు చూస్తుందని కొందరు భావిస్తున్నారు. గతంలో తెలుగు సినిమాలకు నంది అవార్డుల రూపంలో ప్రభుత్వం అవార్డులు ఇచ్చేది. అప్పట్లో ఈ అవార్డులను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేవారు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయి.. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిందో అప్పటి నుండి నంది అవార్డులపై దృష్టి పెట్టడం లేదని కొందరు నిర్మాతలు మండిపడుతున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను ఈ మే 31న మళ్ళీ విడుదల చేసేందుకు సోమవారం ఈ చిత్ర నిర్మాత, కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరి రావు మీడియా సమావేశం నిర్వహించారు. అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాను విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నంది అవార్డలుపై మీడియా అడిగిన ప్రశ్నలకు నిర్మాతలు ఆదిశేషగిరిరావు, అశ్వనీదత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక నంది అవార్డులపై అప్రస్తుతం అయిపోందని శేషగిరి రావు చెప్పుకొచ్చారు.
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు నంది అవార్డులపై ఎటువంటి ఆసక్తి చూపడం లేదన్నారు. గతంలో ప్రభుత్వం అవార్డుకు ఓ వాల్యూ ఉండేదని, తన ఉద్దేశంలో ఈ అవార్డులకు అంత ప్రాధాన్యత లేకుండా పోయందని చెప్పారు.‘ ప్రస్తుతం నడుస్తున సీజన్ వేరు కదా.. ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండ వాళ్లకు ఇస్తారు అవార్డులు. రెండు మూడేళ్లలో ఘనంగా అవార్డులు ఇచ్చే రోజులు వస్తాయి. అప్పుడు మనందరికీ అవార్డులు వస్తాయి అని ఏపీలోని జగన్ సర్కార్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు అశ్వనీదత్. పాన్ ఇండియా సినిమాలంటుంటే సిగ్గు పడాల్సి వస్తుందని కూడా ఆయన మండిపడ్డారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…