Agent Movie : సినీ పరిశ్రమలో కూడా కొన్ని సెంటిమెంట్స్ తప్పక ఉంటాయి. ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు కొన్ని విషయాలలో ఆ సెంటిమెంట్స్ తప్పక పాటిస్తుంటారు. చిన్న చిన్న స్టార్స్ తో పాటు పెద్ద స్టార్స్ కి కూడా సెంటిమెంట్ ఎక్కువే. ఆచి,తూచి ముహూర్తం పెట్టి మరీ ట్రైలర్స్ రిలీజ్ చేయటం, హిట్ సినిమాల డేట్ చూసి మరీ తమ సినిమాని రిలీజ్ చేయడం వంటివి చేస్తారు. అయితే టాలీవుడ్‌లో ఏప్రిల్ 28కి ప్రత్యేకత ఉంది. ఎందుకు అంటే… భారతీయ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన ‘బాహుబలి 2’ విడుదలైనది ఆ రోజే. అంతే కాదు… సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ ‘పోకిరి’ విడుదలైనదీ ఆ రోజే.
గతంలో చూస్తే.. నందమూరి తారక రామారావు ‘అడవి రాముడు’తో ఆంధ్రులను అలరించింది కూడా ఆ రోజే. అలా ఏప్రిల్ 28న విడుదలైన సినిమాలు కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 28న అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం మాత్రం దారుణంగా నిరాశపరచింది. ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఈ ఐకానిక్ డేట్.. సెంటిమెంట్ గురించి నిర్మాత అనిల్ సుంకర ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. అయితే ఇదే ఇప్పుడు నెగిటివ్ ట్రోల్స్ కు కారణమైంది. తొలి రోజు నుండి దారుణంగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 30 కోట్ల కలెక్షన్స్ రావాలి. రెండో రోజు 80 లక్షల కలెక్షన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా డిజాస్టర్ పక్కా అని తేలిపోయింది.
అఖిల్ గత చిత్రాలు చూస్తే చాలా చిత్రాలు ఫ్లాపుల బాట పట్టాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం మాత్రమే పర్వాలేదనిపించింది. ఇక ఏజెంట్ చిత్రం అయితే దారుణంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమాతోఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మొత్తంలోనే నష్టపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించాడు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రను పోషించాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…