Legend Saravanan : త‌న‌పై వ‌స్తున్న ట్రోల్స్‌పై స్పందించిన లెజెండ్ శ‌ర‌వ‌ణ‌న్‌.. ఏమ‌న్నారంటే..?

Legend Saravanan : తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త, శరవణ స్టోర్స్ యజమాని శరవణన్ అరుల్ అలియాస్ ‘లెజెండ్’ శరవణన్‌కు తెరపై కనిపించడం అంటే ఎంత పిచ్చి ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తన శరవణ స్టోర్స్ టీవీ యాడ్స్‌లోనూ ఆయనే నటిస్తారు. స్టార్ హీరోయిన్లతో కలిసి తన బ్రాండ్‌కు ప్రచారం కల్పిస్తారు. అయితే, ఆయనకు సినిమాల్లో నటించాలని ఎప్పటి నుంచో కోరిక ఉండ‌గా, ఎట్ట‌కేల‌కు ‘ది లెజెండ్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 52 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ఈ హీరో ఈ సినిమా కోసం దాదాపు రూ. 60 కోట్లదాకా బడ్జెట్ కేటాయించాడు.

చాలా మంది స్టార్ హీరోయిన్స్ చేత ప్రమోషన్స్ చేసి.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశాడు. కానీ.. లెజెండ్ ని హీరోగా యాక్సెప్ట్ చేయలేక థియేటర్స్ కి ఎవరు వెళ్ల‌క‌పోగా, ఈ సినిమా ట్రైల‌ర్ చూసి చాలా దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఇక ఇప్పుడు ఓటీటీలోను అతడిని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తన సినిమా గురించి, త‌న‌పై వచ్చిన ట్రోల్స్ పై స్పందించాడు. ది లెజెండ్ రిలీజ్ అయ్యాక చాలామంది తనని పర్సనల్ గా ఫోన్ చేసి కామెంట్స్ చేశారని చెప్పిన శరవణన్.. ఇప్పుడు ఆ సినిమాని హాట్ స్టార్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా.. విమర్శలే విజయానికి తొలిమెట్టుగా భావించి ముందుకు వెళ్తానని తెలిపాడు.

Legend Saravanan finally responded on his trolls
Legend Saravanan

మొద‌టి సినిమాకే ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చిన కూడా చాలా ధైర్యంతో రెండో సినిమాకి సైన్ చేశాడు. ఆ స‌మ‌యంలో అత‌డు అనవసరంగా డబ్బు వేస్ట్ చేస్తున్నాడని.. అంతేగాక హీరో అని పరువు కూడా పోగొట్టుకుంటున్నాడని కామెంట్ చేస్తున్నారు. అతను నటించే బదులు.. సినిమాలను వేరే హీరోలతో నిర్మిస్తే మంచి లాభాలైనా వస్తాయని సూచ‌న‌లు చేస్తున్నారు. కాని అవేమి ప‌ట్టంచుకోని శ‌ర‌వ‌ణ‌న్ వ‌రుస‌గా సైన్ చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే త‌నపై వ‌చ్చే విమర్శలే విజయాలకు నాంది అంటున్నాడు శ‌ర‌వ‌ణ‌న్. కాగా, 2022 జులై 28 న ది లెజెండ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్ర‌స్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోది లెజెండ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago