Legend Saravanan : తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త, శరవణ స్టోర్స్ యజమాని శరవణన్ అరుల్ అలియాస్ ‘లెజెండ్’ శరవణన్‌కు తెరపై కనిపించడం అంటే ఎంత పిచ్చి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన శరవణ స్టోర్స్ టీవీ యాడ్స్‌లోనూ ఆయనే నటిస్తారు. స్టార్ హీరోయిన్లతో కలిసి తన బ్రాండ్‌కు ప్రచారం కల్పిస్తారు. అయితే, ఆయనకు సినిమాల్లో నటించాలని ఎప్పటి నుంచో కోరిక ఉండగా, ఎట్టకేలకు ‘ది లెజెండ్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 52 ఏళ్ల వయస్సు ఉన్న ఈ హీరో ఈ సినిమా కోసం దాదాపు రూ. 60 కోట్లదాకా బడ్జెట్ కేటాయించాడు.
చాలా మంది స్టార్ హీరోయిన్స్ చేత ప్రమోషన్స్ చేసి.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశాడు. కానీ.. లెజెండ్ ని హీరోగా యాక్సెప్ట్ చేయలేక థియేటర్స్ కి ఎవరు వెళ్లకపోగా, ఈ సినిమా ట్రైలర్ చూసి చాలా దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఇక ఇప్పుడు ఓటీటీలోను అతడిని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో తన సినిమా గురించి, తనపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించాడు. ది లెజెండ్ రిలీజ్ అయ్యాక చాలామంది తనని పర్సనల్ గా ఫోన్ చేసి కామెంట్స్ చేశారని చెప్పిన శరవణన్.. ఇప్పుడు ఆ సినిమాని హాట్ స్టార్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా.. విమర్శలే విజయానికి తొలిమెట్టుగా భావించి ముందుకు వెళ్తానని తెలిపాడు.

మొదటి సినిమాకే ఎన్నో విమర్శలు వచ్చిన కూడా చాలా ధైర్యంతో రెండో సినిమాకి సైన్ చేశాడు. ఆ సమయంలో అతడు అనవసరంగా డబ్బు వేస్ట్ చేస్తున్నాడని.. అంతేగాక హీరో అని పరువు కూడా పోగొట్టుకుంటున్నాడని కామెంట్ చేస్తున్నారు. అతను నటించే బదులు.. సినిమాలను వేరే హీరోలతో నిర్మిస్తే మంచి లాభాలైనా వస్తాయని సూచనలు చేస్తున్నారు. కాని అవేమి పట్టంచుకోని శరవణన్ వరుసగా సైన్ చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే తనపై వచ్చే విమర్శలే విజయాలకు నాంది అంటున్నాడు శరవణన్. కాగా, 2022 జులై 28 న ది లెజెండ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోది లెజెండ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.