Puri Jagannadh And Charmme Kaur : హీరోయిన్ గా పలు సినిమాల్లో ఛాన్సులు వస్తున్న సమయంలోనే దర్శకుడు పూరీజగన్నాథ్ నిర్మించిన సంస్థలో చేరి ఆయనతో పలు సినిమాలను నిర్మిస్తుంది ఛార్మి. ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ హిట్ కొట్టిన ఈ ఇద్దరు చివరగా లైగర్ సినిమా తో చాలా నష్టపోయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. దీంతో ఛార్మి, పూరి కి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. నటనపరంగా ఆసక్తి లేనని గత కొద్ది రోజుల క్రితం చెప్పగా నిర్మాతగా సక్సెస్ కాలేకపోవడంతో తప్పని పరిస్థితులలో మళ్ళీ నటన వైపు అడుగులు వేస్తుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే లైగర్ తర్వాత చాలా సైలెంట్‌గా ఉన్న ఈ జంట మళ్లీ మెరిసారు.
తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. ఎయిర్ పోర్టులో వీరు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరు ముంబైకి ఎందుకు వెళ్లారనే విషయంలో అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. బాలీవుడ్ లో ఏదైనా కొత్త ప్రాజెక్టు కోసం వెళ్లారా అనే విషయంలో దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ వీరిద్దరూ మళ్లీ బహిరంగంగా కనిపించేసరికి సినీ అభిమానుల్లో జోష్ వచ్చింది. మరో కొత్త సినిమాను పట్టాలెక్కిస్తున్నారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
పూరీ జగన్నాథ్ తీయాల్సిన ‘జనగణమన’ అర్థాంతరంగా ఆపేసిన తర్వాత కొత్త ప్రాజెక్ట్ ఏం అనౌన్స్ చేయలేదు. ఇలాంటి టైంలో పూరీ నవ్వుతూ కనిపించడం ఫ్యాన్స్ కు కాస్త రిలాక్సేషన్ ని ఇచ్చింది అనే చెప్పాలి. విజయ్ దేవరకొండతో జనగణమన మొదలు పెడతాడా లేదంటే ఈ లోపు మరో క్రేజీ ప్రాజెక్ట్ చేసి దాంతో హిట్ కొట్టాక ఈ సినిమా చేస్తాడా అన్నదానిపై క్లారిటీ రావలసి ఉంది. కాగా, పూరీ జగన్నాథ్ సినిమాలే కాదు ఆయన పెన్ కూడా చాలా స్పీడ్. అందరు డైరెక్టర్స్ ఆచితూచి సినిమాలు తీస్తే.. పూరీ మాత్రం స్టార్ హీరోలతో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అదంతా ఒకప్పుడు.. ‘బిజినెస్ మేన్’ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ తప్పితే ఒక్కటంటే ఒక్క హిట్ లేకపోవడంతో కాస్త స్లో అయ్యాడు.