Namrata Shirodkar : టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్, నమ్రతల జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు. మహేష్ సినిమాలు, బిజినెస్‌లో దూసుకుపోతుండగా, ఆయనకు నమ్రత ఎంతో సపోర్టివ్‌గా ఉంటుంది. మహేష్ ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే బిజినెస్‌మ్యాన్‌గానూ బిజీ అవుతున్నారు ఇప్పటికే థియేటర్స్, క్లాతింగ్ బిజినెస్‌లో రాణిస్తున్న మహేష్.. ఇప్పుడు ఆయన భార్య నమ్రతచే రెస్టారెంట్ బిజినెస్‌లోకి అడుగు పెట్టించిన విషయం తెలిసిందే. ఏసియన్ గ్రూప్‌తో కలిసి థియేటర్ చైన్ స్టార్ట్ చేసిన మహేష్.. తాజాగా అదే గ్రూప్‌తో కలిసి ఈ రెస్టారెంట్‌ని ప్రారంభించారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను గురువారం నాడు ప్రారంభించారు. పలువురు ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరైన ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమ తాలూకు వీడియోలు, ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే మహేష్ రెస్టారెంట్లో తినాలని ఆయన అభిమానులు భావిస్తుండగా, వారికి పగటిపూటే చుక్కలు కనిపిస్తున్నాయి. స్నాక్స్ ఐటమ్స్ కు సైతం ధరలు వందల్లో ఉండడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. మెనూ ప్రకారం కేవలం రెండు ఇడ్లీలకు తో రూ.90 గా ఉంది. అదేవిధంగా మిరపకాయ బజ్జీలు ఒక్కప్లేట్ ధర రూ.125 గా కనిపిస్తుంది. అంతేకాకుండా ఒక కప్ టీ రూపాయలు 80 గా ఉంది.
సాధారణంగా బయట నాలుగు ఇడ్లీల ధర రూ.30 గా ఉంటుంది. టీ చూస్తే 10 రూపాయలు ఉంటుంది. కాని నమ్రత రెస్టారెంట్లో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. అయితే ఇంత ధరలు పెట్టడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతర హోటళ్లతో ఈ రెస్టారెంట్ ను పోల్చవద్దని మహేష్ తను సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నాడని గుర్తుంచుకోవాలని ఫ్యాన్స్ చెబుతున్నారు.