Lavanya Tripathi : ఆరడుగుల అందగాడు, మెగా ఫ్యామిలీలో విభిన్న కథాంశాలతో సినిమాలు చేసే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ తేజ్ . ఇతడు జూన్ 2న ‘అందాల రాక్షసి’గా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమైన లావణ్య త్రిపాఠిని జూన్ 9న నిశ్చితార్థం జరుపుకున్నాడు. ‘అంతరిక్షం’, ‘మిస్టర్’ సినిమాల్లో వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించారు. మిస్టర్ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు కూడా దారి తీసిందని అంటున్నారు. అయితే వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.
సుమ ఓ సారి సరదాగా లావణ్య త్రిపాఠిని తన ఎదురుగా కూర్చోపెట్టుకొని సరదా ప్రశ్నలు అడిగింది. ఆ సందర్భంలో కాంట్రవర్సీలు తన చుట్టూ వైఫైలా ఉంటాయని కూడా పేర్కొంది. పార్టీకి వస్తానని చెప్పి చాలా సార్లు ఎగ్గొట్టానని చెప్పింది లావణ్య. ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్, నిఖిల్ ఈ ముగ్గురిలో ఎవరితో కలిసి నటిస్తావు అంటే చిరంజీవి గారు అని చెప్పింది. ముగ్గురిలో అతను సీనియర్ హీరో కాబట్టి చిరు సార్ తో నటిస్తానని చెప్పింది.అమ్మాయిలు ఎప్పుడు ఎక్కువగా నటిస్తారని సుమ అడుగుతూ రెండు ఆప్షన్ లు ఇచ్చింది.
బాయ్ ఫ్రెండ్ తో దొరికినప్పుడు, స్కూల్ లేదా కాలేజ్ బంక్ కొట్టి పేరెంట్స్ కి దొరికినప్పుడు లేదా యాంకర్‌కి దొరికినప్పుడు అని అడగగా అప్పుడు లావణ్య త్రిపాఠి.. ఫ్రెండ్ లీ యాంకర్ కదా ఏం కాదు అని నవ్వుతూ చెప్పింది. అయితే వీటన్నింటిలో ఆమె చిరంజీవితో కలిసి నటిస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా జరిగిన నిశ్చితార్థ వేడుకలో లావణ్యకు వరుణ్ తేజ్ డైమండ్ రింగ్ తొడగినట్టు సమాచారం. ఇది దాదాపు రూ. 25 లక్షల వరకు ఉన్నట్టు సమాచారం. మరోవైపు లావణ్య కూడా వరుణ్ తేజ్‌కు అదే లెవల్లో నిశ్చితార్ధపు ఉంగరం పెట్టినట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…