Anasuya : టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండకు, స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మధ్య వివాదం కొన్నాళ్ల నుండి సాగుతున్న విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి సమయంలో వీరి మధ్య భగ్గుమన్న మనస్పర్దలు పెరుగుతూ వచ్చాయే తప్ప తగ్గలేదు. గత ఏడాది వచ్చిన లైగర్, అంతెందుకు రీసెంట్‌గా వచ్చిన ఖుషి పోస్టర్ వరకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి, అనసూయకు మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనేలా మాటల తూటాలు పేలాయి. ఎక్కడ కూడా విజయ్ దేవరకొండ పేరుని ప్రస్తావించకుండా ఆయనపై దారుణమైన వ్యాఖ్యలు చేసింది. వాటిపై విజయ్ దేవరకొండ స్పందించలేదు కాని రౌడీ ఫ్యాన్స్ మాత్రం దారుణంగా తిట్టి పోసారు.
గత కొన్నాళ్లుగా అనసూయ- విజయ్ ల వివాదం నడుస్తుండగా, రీసెంట్‌గా విమానం సక్సెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ ఇక నుండి ఈ వివాదాలకి పులిస్టాప్ పెడుతున్నట్టు తెలియజేసింది. తనపై కొందరు డబ్బులిచ్చి మరీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయిస్తున్నారని, ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డానని ఆమె పేర్కొన్నారు. ఏదైతేనేం ఇప్పటికైనా అనసూయ విజయ్ దేవరకొండ, ఆయన ఫ్యాన్స్‌తో కాంట్రవర్సీ మాటలకు దూరంగా ఉంటానని చెప్పటం మంచి విషయమే. నా మానసిక ప్రశాంతత కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాను. ఓ మహిళను, పైగా పిల్లలకు తల్లిని అయిన నాపై అలాంటి ప్రచారం చేశారనే విషయం తెలిసి బాధేసింది.
ఎవరైనా పొద్దున్న లేచినప్పట్నుంచి ఎవరితోనైనా మెప్పు పొందుదామనే ప్రయత్నిస్తాం. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీనికితోడు నాపై ట్రోలింగ్ ను డబ్బులిచ్చి మరీ చేయించారని తెలిసిన తర్వాత చాలా బాధేసింది. అందుకే మానసిక ప్రశాంతత కోసం ఇక ఆ వివాదాన్ని ఇక్కడితో వదిలేయాలని నిర్ణయించుకున్నాను అని అనసూయ తెలిపింది . వివాదానికి సంబంధించి హీరో విజయ్ దేవరకొండతో కూడా మాట్లాడ్డానికి కూడా ప్రయత్నించిందట అనసూయ. కాకపోతే పీఆర్ వ్యవస్థల వల్ల అది సాధ్యం కాలేదని, తనకు ఎలాంటి పీఆర్ లేరని స్పష్టం చేసింది. ఇంతకుముందు తను ‘నో ఫిల్టర్’గా ఎలా ఉన్నానో, ఇకపై కూడా అలానే ఉంటానని స్పష్టం చేసింది అనసూయ.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…