ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పరిస్థితి దారుణాతి దారుణంగా మారింది. ఈ సారి ఎలా అయిన అధికారాన్ని చేజిక్కించుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఆయనకి అడుగడుగున అవాంతరాలే ఎదురవుతున్నాయి. అసమ్మతి స్వరాలతో వణికిపోతున్న చంద్రబాబుకు, సొంత జిల్లాలో కూడా అదే పరిస్థితి ఎదురుకావడంతో కాస్త వెనక్కి తగ్గారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ ఇన్‌చార్జ్ బొజ్జల సుధీర్‌రెడ్డితో దెబ్బకి చంద్రబాబు వణికిపోయారు. ఆ నియోజకవర్గ వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఇవాళ టీడీపీలో చేరికను నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బొజ్జల సుధీర్‌రెడ్డి విడుదల చేసిన ఒకే ఒక్క వాయిస్ మెసేజ్‌తో చంద్రబాబు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్సీవీ నాయుడి జాయినింగ్ గురించి తనకు తెలియదని… పార్టీ లీడర్లు కేడర్ ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదని శ్రీకాళహస్తి టీడీపీ ఇన్‌చార్జ్‌గా సుధీర్ రెడ్డి కేడర్ సందేశం పంపించారు. అది అలా వైరల్ అవుతూ టీడీపీ అధినాయకత్వానికి చేరింది. దీంతో ప్లాన్‌లో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. ముందు బొజ్జల సుధీర్ రెడ్డితో మాట్లాడి పరిస్థితి చక్క దిద్దిన తర్వాత జాయినింగ్స్ పెట్టుకుంటే మంచిదని టీడీపీ భావిస్తోంది.
బొజ్జల సుధీర్ ఆగ్రహించకపోతే ఎస్సీవీ నాయుడి చేరిక జరిగిపోయేదనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల టీడీపీలో అసమ్మతి గళాలు పెరిగిపోతున్నాయి. నంద్యాలలో లోకేశ్ పాదయాత్రలోనే టీడీపీ నేత ఏవీపై మాజీ మంత్రి నేతృత్వంలో భౌతిక దాడి జరగడం మనం చూశాం. అయినా పార్టీ ఏమీ చేయలేని పరిస్థితి. విజయవాడ ఎంపీ కేశినేని నాని, చిలకలూరిపేట ఇన్‌చార్జ్ పత్తిపాటి పుల్లారావు, కోడెల శివరామ్ తదితరులు బహిరంగంగానే టీడీపీ అధిష్టానం వైఖరిపై వ్యతిరేకంగా మాట్లాడుతుండడం మనం గమనించాం. ఇలాంటి పరిస్థితి గతంలో టీడీపీలో ఎన్నడూ లేదు. చంద్రబాబు నాయకత్వం బలహీనపడిందనడానికి ఇవే నిదర్శనం. ప్రస్తుత పరిస్థితులని గమనిస్తున్న టీడీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. మరి రానున్న రోజులలో చంద్రబాబు ఎలాంటి ప్లాన్స్ తో ముందుకు సాగుతారో చూడాలి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…