Upasana : చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నాడు. రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. విదేశాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది చరణ్ కు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో షూట్ చేస్తున్నారు. శంకర్ అటు కమల్ హాసన్ ఇండియన్ 2 ) సినిమా కూడా ఒకేసారి చేస్తుండటంతో చరణ్ సినిమా స్లోగా సాగుతుంది. ఇక శంకర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు చెర్రీ.అయితే ఈ ఏడాది చరణ్‌కి లక్కీ ఇయర్ అని చెప్ప్పాలి.
చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ రావడంతో పాటు ఈ ఏడాదే చరణ్ తండ్రి ప్రమోషన్ కూడా అందుకోనున్నాడు. చరణ్ భార్య ఉపాసన ఇటీవలే ప్రెగ్నెంట్ అయిందని, త్వరలో తల్లి కాబోతుందని కొన్ని నెలల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఇటీవల చరణ్ పుట్టిన రోజు పార్టీలో బేబీ బంప్ తో కూడా కనపడి అలరించింది ఉపాసన. పెళ్లి అయిన పది సంవత్సరాల తర్వాత ఉపాసన తల్లి కాబోతుండటంతో ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాసన ప్రెగ్నెంట్ అని చెప్పిన దగర్నుంచి చరణ్ షూటింగ్ లేకపోతే ఉపాసనతోనే టైం గడుపుతున్నాడు. ఉపాసనతో కలిసి ట్రిప్స్ వేస్తున్నాడు.
అయితే మెగా వారసుడు/ వారసురాలి కోసం మెగా కుటుంబంతో పాటు అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక గర్భంతో ఉన్న ఉపాసనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటోంది మెగా ఫ్యామిలీ. ముఖ్యంగా రామ్ చరణ్ అనుక్షణం తన భార్య వెంటే ఉంటున్నాడు. ఉప్సీ మొదటిసారి తల్లికానుండడంతో షూటింగ్‌ల నుంచి కూడా విరామం తీసుకుని మరీ తన సతీమణిని చూసుకుంటున్నాడు. కాగా తాజాగా రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్ శర్వానంద్ రిసెప్షన్‌కు జంటగా హాజరయ్యారు చరణ్, ఉపాసన. ఈ సందర్భంగా ఉపాసన చెయ్యి పట్టుకొని రామ్‌చరణ్ నడిపించిన తీరు అక్కున్న వారందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘క్యూట్ కపుల్, లవ్లీ కపుల్’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కాగా, రాజస్తాన్‌లో జరిగిన పెళ్లికి రామ్ చరణ్ ఒక్కడే హాజరయ్యాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…