Samantha : విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చంది. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. సినిమా విజయంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రెస్ మీట్‌లో దర్శకుడు శివ నిర్వాణకు ఒక క్లిష్టమైన ప్రశ్న ఎదురైంది. సినిమాలో విజయ్ దేవరకొండ, సమంతలకు లిప్ లాక్ సీన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని ఒక జర్నలిస్ట్ అడిగారు. దీనికి శివ నిర్వాణ చాలా కూల్‌గా సమాధానం ఇచ్చారు. ‘
ఇద్దరూ ఒక ఏడాది పాటు కలిసి ప్రయాణం చేశారు.. పెళ్లయ్యింది.. పిల్లల కోసం అని ఒక ఎమోషన్ పెట్టాం.. ఈ ఎమోషన్‌లో ఒక చిన్న ముచ్చట కూడా లేకపోతే అసలు అర్థంపర్థం ఉంటుందా. కొంచెం నేచురల్‌గా చూపించాలి కదా. జనం నమ్మాలికదా. నిజంగానే భార్యాభర్తలుగా ఉన్నారనే ఫీలింగ్ రావాలి కదా’. అది ఇలా సింపుల్ గా, పద్దతిగా ఉన్నంతవరకు ప్రాబ్లమ్ లేదు అని దర్శకుడు శివ నిర్వాణ అన్నారు. అయితే పలువురు నెటిజన్లు భార్య భర్తల సినిమాలు, ఇంతకంటే ఎక్కువ ఎమోషన్ సినిమాలు రొమాంటిక్ సీన్స్, లిప్ కిస్ సీన్స్ లేనివి చాలా సినిమాలు ఉన్నాయి, మరి వాళ్ళు ఎలా తీశారు అని కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ , సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషి. ఈ సినిమా మూడు రోజుల్లోనే 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 100 కోట్ల కలెక్షన్స్ కి దూసుకుపోతుంది. ఖుషి సక్సెస్ తో చిత్రయూనిట్ సక్సెస్ మీట్స్ కూడా నిర్వహిస్తుంది. ఖుషి సినిమా ఫ్యామిలీ స్టోరీ అని చెప్తున్నా విజయ్, సమంత మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఒక పాటలోనే వీరిద్దరి మధ్య క్లోజ్ రొమాంటిక్ సీన్స్ పెట్టారు. విజయ్ సమంతలతో లిప్ కిస్ సీన్ కూడా పెట్టారు. ఇది కొంత మందికి మింగుడుపడడం లేదు. అయితే ఈ సినిమా సక్సెస్‌తో డిస్ట్రిబ్యూటర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…