Chandrababu : ఉచ్చులో చంద్ర‌బాబు.. ఆ ముగ్గురికి నోటీసులు ఇవ్వ‌డంతో వ‌ణికిపోతున్న చంద్ర‌బాబు..?

Chandrababu : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఐటీ నోటీసుల వ్యవహారంతో ఏపీ సీఐడీ స్పీడ్ పెంచనుంది. ఈ నోటీసులకు గతంలో రిజిస్టర్ అయిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు లింకు పెట్టి దర్యాప్తు చేయాలని అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులతో మరోసారి సీఐడీ రంగంలోకి దిగింది. ఐటీ నోటీసుల్లో పేర్కొన్న పేర్లు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో వెలుగులోకి వచ్చిన పేర్లు ఒకేలా ఉన్నాయని సీఐడీ భావిస్తోంది. రెండింటి మూలాలు ఒకేచోట ఉన్నాయని దీనిపై మరింత లోతుగా విచారణ జరపాలని నిర్ణయించిందట. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల్లో మనోజ్ వాసుదేవ్ పార్థసాని కీలకపాత్ర పోషించారని చెబుతుంది… స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో సూత్రధారిగా భావిస్తున్న యోగేశ్ గుప్తాకు ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.

వీళ్లను త్వరలోనే అదుపులోకి తీసుకుని ప్రశ్నించనుంది. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో ఇష్టానుసారం రేట్లు పెంచి.. కాంట్రాక్స్‌ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారని ఇప్పటికే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆదాయపు పన్ను శాఖ నాలుగేళ్లుగా విచారణ జరుపుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లోనూ భారీగా అవినీతిని జరిగిందన్న అభియోగాలు కూడా ఉన్నాయి. ఈ రెండు స్కామ్‌లలో చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్ పాత్ర ఉన్నట్టు అభియోగాలు కూడా న‌మోదు అయ్యాయి. రెండు స్కాంలలో డబ్బులు చేరింది చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ దగ్గరకే అని భావిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. ఈ స్కాంలో ఇంకా ఎవరెవరుఉన్నారు… వారి మధ్య ఉన్న సంబంధాలు ఏంటి..? వారి మధ్య జరిగిన సంభాషణలు ఏంటి..? అనే అంశాలపై ఏపీ సీఐడీ దృష్టి పెట్టిందని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెప్పుకొస్తున్నాయి.

Chandrababu facing problems with latest cases
Chandrababu

ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ల లింకులు దుబాయ్‌ వరకు ఉన్నట్టు ఆరోప‌ణ‌లు చేస్తుండ‌గా, దుబాయిలోనూ డబ్బు అందుకున్నారని అనుమానంతో దానిపై కూడా ఫోకస్‌ పెట్టారట. 8వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు అప్పగించిన షాపూర్జీ పల్లోంజీ, లార్సన్ అండ్ టూబ్రో సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు భ‌యంతో వణికిపోతున్నార‌ని చెప్పుకొస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago