Kriti Sanon : బాలీవుడ్ భామ కృతి శెట్టి తెలుగులో వన్ నేనొక్కడినే అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్యతో దోచేయ్ అనే మూవీ చేసింది. ఈ చిత్రం కూడా ఫ్లాప్ అయింది. ఆ సమయంలో బాలీవుడ్‌లోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా పేరు ప్రఖ్యాతలు అందుకుంది. ఈ అమ్మడు చాలా రోజుల తర్వాత ఆదిపురుష్ అనే సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ప్రభాస్ , కృతిసనన్ జంటగా నటించిన ‘ఆది పురుష్ చిత్రం జూన్ 16న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది.
చిన జీయర్ స్వామి స్పెషల్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుకలో ప్రభాస్ గురించి కృతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన గురించి అందరూ అనుకుంటున్నది నిజం కాదని చెప్పారు. ముందుగా ఈవెంట్ “జై శ్రీ రామ్” నినాదంతో స్పీచ్ ప్రారంభించిన ఆమె.. తమకు మద్దతు తెలియజేయడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రభాస్ అభిమానులకి ధన్యవాదాలు తెలియజేసింది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో నా కెరీర్‌ని ప్రారంభించిన తొమ్మిదేళ్ల తర్వాత ‘ఆదిపురుష్’ సినిమాతో మళ్లీ మీ అందరి ముందుకు వస్తున్నాను. ఈ సినిమాలో నేను పోషించిన జానకి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది అని పేర్కొంది.
కొన్నిసార్లు మనం సినిమాలను ఎంచుకోవడం కాదు, కొన్ని సినిమాలు మనల్ని ఎంచుకుంటాయి. ఈ కథ చెప్పడానికి జానకి నన్ను ఎంచుకున్నట్లు నాకు అనిపిస్తుంది. ఈ సినిమా విజయం సాధించి, ఎప్పటికీ నిలిచిపోయే హిట్‌గా నిలవాలని మీ ఆశీస్సులు కోరుతున్నాం” అని అన్నారు. ప్రభాస్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని కూడా చెప్పుకొస్తూ.. ప్రభాస్ మాట్లాడడు అని నాకు చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. అతను వెరీ స్వీట్. ఆయన కళ్లలోని ప్రశాంతత, స్వచ్ఛత శ్రీరాముడి గుణాలకు ప్రతిబింబమని నేను భావిస్తున్నాను. శ్రీరాముడి పాత్రను ప్రభాస్ కంటే మరెవరు పోషించలేరని తెలిపింది. అయితే కృతి మాట్లాడుతున్న సమయంలో కొందరు వదిన వదిన అంటూ కేకలు వేశారు. ఆ సమయంలో స్టేజ్ పైనే ఉన్న యాంకర్ ప్రదీప్ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. కాగా కృతి సనన్, ప్రభాస్ మధ్య సమ్ థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని ఇటీవల ప్రచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…