Indira Devi : మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిరాదేవి గురించి ఈ విష‌యాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Indira Devi : సూప‌ర్ స్టార్ కృష్ణ సతీమ‌ణి, మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిరా దేవి గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో అనారోగ్యంతో క‌న్నుమూసారు. ఆమె మ‌ర‌ణంతో మ‌హేష్ బాబు చాలా కుంగిపోయారు. త‌ల్లి అంటే మ‌హేష్‌కి చాలా ప్రాణం. త‌ల్లికి సంబంధించిన ఏ విష‌యం అయిన అభిమానులో పంచుకునే వారు మ‌హేష్‌. ఆమె మ‌ర‌ణం త‌ర్వాత కొన్నాళ్ల పాటు మ‌హేష్ చాలా కుంగిపోయారు. అయితే ఇందిరా దేవిని మొద‌ట వివాహం చేసుకున్నారు కృష్ణ‌. నటన మీద ఉన్న మక్కువతో కృష్ణ డిగ్రీ పూర్తైన వెంటనే మద్రాసు వెళ్లారు. అక్కడ అవకాశాల కోసం వేచి చూస్తోన్న సమయంలోనే.. అంటే 1965లో ‘తేనే మనసులు’ అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. ఇక, ఆ సంవత్సరమే నవంబర్‌లో కృష్ణ.. ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

సూపర్ స్టార్ కృష్ణతో ఇందిరా దేవికి వివాహం జరిగిన తర్వాత వీళ్ల వైవాహిక జీవితం కొన్నాళ్ల‌పాటు సజావుగానే సాగింది. ఈ క్రమంలోనే ఈ జంటకు రమేష్ బాబు, పద్మావతి జన్మించారు. ఆ సమయంలోనే కృష్ణ, తోటి నటి విజయ నిర్మలతో చాలా కాలం పాటు సహజీవనం చేసినట్లు ప్రచారం జరిగింది. ఇలా 1969లో ఆమెను గుడిలో రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారింది. విజయ నిర్మలను వివాహం చేసుకున్న తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ఈ విషయాన్ని నేరుగా తన భార్య ఇందిరా దేవికి చెప్పగా, మొదట్లో ఈ విష‌యం విని ఆమె చాలా బాధపడింద‌ట‌. ఆ తర్వాత భర్త నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని తేల్చి చెప్పేశారని తెలిసింది.

Indira Devi important facts to know
Indira Devi

ఇక, రెండో పెళ్లి అయినా భర్తతోనే కలిసి ఉంటానని సూటిగా చెప్పారంట. దీంతో కృష్ణ ఇద్దరు భార్యలతోనూ కలిసి ఉండేవారు. విజయ నిర్మలను వివాహం చేసుకున్న తర్వాత కూడా ఇందిరా దేవితో ఎక్కువగా కలిసి ఉండేవారు కృష్ణ‌. ఈ క్రమంలోనే ఈ జంటకు మంజుల, మహేశ్ బాబు, ప్రియదర్శినిలు జన్మించారు. పిల్ల‌లు జ‌న్మించాక ఇందిరా తన పిల్లలతోనే కలిసి ఉండేవారు. కానీ, కృష్ణ మాత్రం విజయ నిర్మలతోనే ఎక్కువగా ఉండేవారని టాక్ ఉంది. బ్రతికినంత కాలం ఇందిరాదేవి చాలా నిస్వార్ధంగా కుటుంబం కోసం జీవించారు. 70 ఏళ్ల ఇందిరాదేవి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ. సెప్టెంబర్ 28 తెల్లవారుఝామున క‌న్నుమూసారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago