Sidharth : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన శర్వానంద్ ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో వివాహం చేసుకున్న శర్వానంద్ ఆ తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ జరుపుకున్నారు. అయితే జూన్ 3న జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి రక్షిత రెడ్డిని శర్వానంద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకకు రామచరణ్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ సహా పలువురు సెలబ్రెటీలు వివాహ వేడుకకు హాజరై.. సందడి చేశారు. ఇక ఈ పెళ్లి వేడుకలో సిద్ధార్థ్ మరింత అట్రాక్షన్ గా నిలిచాడు. అంతేకాకుండా పెళ్లిలో లైవ్ కాన్సెర్ట్ జరుగుతుంటే స్టేజీ పైకి వెళ్లి పాట పాడి అతిథులను అలరించాడు.ముఖ్యంగా రామ్ చరణ్ సిద్ధార్థ్ పాటకి ఫుల్ ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది.
లైవ్ కాన్సర్ట్‌లో సింగర్స్ ఓయ్ సినిమాలో ఓయ్ ఓయ్ అంటూ పాడుతుండగా స్టేజీ మీదికి వెళ్లిన సిద్ధార్థ్ తనూ గొంతు కలిపాడు. సిద్ధార్థ్ ను ఎంకరేజ్ చేసేందుకు సింగర్స్ పాడడం ఆపేయగా.. సిద్ధార్థ్ ఓయ్ ఓయ్ అంటూ పాట పాడారు. స్టేజిపై సిద్ధార్థ్ పాడుతుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.. సినిమాలోనూ ఈ పాట పాడింది హీరో సిద్ధార్థే కావడం విశేషం. కాగా, మహాసముద్రం మూవీలో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించారు. ఇందులో అదితీరావు హైదరీ కథానాయికగా నటించగా.. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత హీరోలు ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు.
గత కొద్ది రోజులుగా సిద్ధార్థ్.. అదితితో కలిసి తెగ చుట్టేస్తున్నారు. వీరిద్దరి మధ్య సమ్ థింగ్ ఉందని అందరికి ఓ క్లారిటీ వచ్చేసింది. కాగా సిద్ధార్థ్, అదితిరావ్ హైదరిలకు వేరే వ్యక్తులతో పెళ్ళిళ్ళై విడాకులు అయ్యాయి. సిద్ధార్థ్ 2003లో మేఘన అనే అభిమానిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2007లో ఆమెకు విడాకులు ఇచ్చారు. అప్పటి నుండి మళ్ళీ పెళ్లి మాట ఎత్తలేదు. అదితి చాలా చిన్న వయసులో సత్యదేవ్ మిశ్రా అనే వ్యక్తిని రహస్య వివాహం చేసుకున్నారు. అనంతరం అతనితో అదితి విడిపోవడం జరిగింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…