Krishna Vamsi : కృష్ణ వంశీ.. తెలుగు సినిమా పరిశ్రమలో ఈ పేరుకి పరిచయాలు అక్కర్లేదు. విభిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కించి క్రియేటివ్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వంలో గులాబీ, సింధూరం, ఖడ్గం, అంతఃపురం వంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తెరకెక్కాయి. అయితే కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని కృష్ణ వంశీ చివరిగా నక్షత్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ మూవీ తర్వాత సుమారు ఐదేండ్లకు ‘రంగమర్తాండతో పలకరించబోతున్నాడు. డిఫరెంట్ కాన్సెఫ్ట్ తో రూపొందిన ఈ సినిమాలో రమ్యకృష్ణ సైతం కీలక పాత్ర చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది.
ఈ సినిమాలో రమ్య కృష్ణ పాత్ర గురించి మాట్లాడారు కృష్ణ వంశీ. ఈసినిమా కోసం ముందుగా రమ్య పాత్ర వేరేవాళ్ళను అనుకున్నా.. ఆమెకూడా కొన్ని పేర్లు చెప్పింది. కాని అది నువ్వే ఎందకు చేయకూడదు అంటూ.. రమ్యను రంగంలోకి దింపాము అన్నారు కృష్ణ వంశీ. ఈ సినిమాలో తన పాత్రకు అన్నీ తానే చేసుకుంది. కళ్లతో ఆమె పలికించిన హావభావాలు చూసి కన్నీళ్లు వచ్చాయి. ఆ క్లైమాక్స్ సీన్ 36 గంటలు తీశాను.. అంతలా నటించి మెప్పించింది. అసలు రమ్య పర్‌ఫార్మెన్స్ గుర్తు తెచ్చుకుంటూ రోజంతా నిద్ర పోలేదని అన్నారు ఈ క్రియేటివ్ డైరెక్టర్.
ఇక ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ భాష అయినా.. ఆ భాష నటుడికంటే కూడా ఎక్కువ పట్ట ఉంటుంది ప్రకాశ్ కు. అటు బ్రహ్మానందంగారు కూడా తినకుండా.. తన సీన్స్ అయ్యే వరకూ ఓపిగ్గా చేసేవారు. తన ఫెసియల్ ఎక్స్ ప్రెషన్స్ తో సీన్స్ పండించారు అన్నారు కృష్ణవంశీ. ఈ మధ్య కృష్ణ వంశీ, రమ్యకృష్ణ విడిపోయారంటూ చాలా వార్తలు వచ్చాయి. అయితే కొడుకుతో కలిసి రమ్యకృష్ష చెన్నైలో ఉంటున్నారని, సినిమాల కోసం తాను హైదరాబాద్ లో ఉంటున్నట్లు వంశీ తెలిపారు. ఎప్పుడు ఖాళీ టైం దొరికినా తాను చెన్నైకి వెళ్తుంటానని చెప్పారు కృష్ణవంశీ.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…