Niharika Konidela : ఇటీవలి కాలంలో సెలబ్రిటీల విడాకులకి సంబంధించి తరచూ వార్తలు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. సమంత- నాగ చైతన్య జంట విడిపోయిన తర్వాత చాలా మంది సెలబ్స్ కూడా బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే కొన్నాళ్లుగా నిహారిక- చైతన్య కూడా విడిపోతున్నట్టు ప్రచారాలు నడుస్తున్నాయి. మూడేళ్ల క్రితం ఈ ఇద్దరు రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు.ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీ అంతా హాజరై సందడి చేసింది. అయితే రీసెంట్‌గా నిహారిక, చైతన్య జొన్నలగడ్డ మధ్య మనస్పార్థాలు వచ్చాయని, దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
నిహారిక, చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. మెగా ఫ్యామిలీలో అందరినీ ఫాలో అవుతున్న చైతన్య.. నిహారికను మాత్రం అన్‌ఫాలో చేయడం ఆశ్చర్యకరంగా మారింది. అంతేకాదు, తమ పెళ్లి ఫొటోలను సైతం చైతన్య ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేశారు. నిహారికతో దిగిన ఒక్క ఫొటో కూడా ఇప్పుడు చైతన్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో లేదు. దీంతో నిహారిక, చైతన్య విడాకులు తీసుకోతున్నారనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. అయితే నిహారిక మాత్రం తమ పెళ్లి ఫోటోలని సోషల్ మీడియాలో అలానే ఉంచేసుకుంది.
ఇటీవల సెలబ్రిటీస్ సోషల్ మీడియా ద్వారానే విడాకుల విషయంపై హింట్ ఇస్తున్నారు. ఇప్పుడు వీరు కూడా ఇలా హింట్ ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. మరి దీనిపై ఇప్పటివరకు అటు మెగా ఫ్యామిలీ కాని.. ఇటు జొన్నలగడ్డ ఫ్యామిలీ కాని అఫీషియల్ గా స్పందించలేదు . గతంలో నాగచైతన్య , సమంత ,ధనుష్ లాంటి వాళ్ళు సోషల్ మీడియా ద్వారానే హింట్ ఇచ్చారు. నిజానికి నిహారిక, చైతన్యలది ప్రేమ వివాహం. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. వీరిని మెగా ఫ్యామిలీలోనే చూడచక్కనైన జంట అని అంతా అన్నారు. చైతన్యను అయితే మెగా అభిమానులు ‘బావ బావ’ అంటూ ఆకాశానికి కూడా ఎత్తేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…