Krishna Health : కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందాను నటశేఖర కృష్ణ. ఆయనకు ఇటీవల దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. సూపర్ స్టార్ కృష్ణ రెండవ భార్య విజయనిర్మల 2019 జూన్ 27న హార్ట్ అటాక్ తో కన్నుమూశారు. అనుకోని ఈ సంఘటన కృష్ణ కుటుంబాన్ని షాక్ కి గురి చేసింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో మహేష్ అన్నయ్య రమేష్ బాబు అకాల మృతి చెందారు. ఆయన మృతి నుండి కోలుకునే లోపు సెప్టెంబర్ 28 మహేష్ తల్లి, కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్నుమూశారు. ఇలా వరుస విషాదాలతో కృష్ణ చాలా కుంగిపోయారు.
సూపర్ స్టార్ కృష్ణ గత కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో మహేష్ బాబు భార్య నమ్రత, కృష్ణను గచ్చిబౌలీలోని కాంటినెంటల్ హస్సిటల్‌లో చేర్చారు అని కాంటినెంటల్ వైద్యులు మీడియాకు తెలిపారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కృష్ణ వెంటిలేటర్‌పై ఉన్నట్టు పేర్కొన్నారు. 24 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమన్నారు. శరీరం సహకరిస్తుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. కార్డియాక్ అరెస్ట్‌తో అర్ధరాత్రి సమయంలో ఆయన్ను ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. అప్పటికే ఆయన స్పృహలో లేరని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఇంటెన్సీవ్ కేర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వారు తెలియజేశారు.
అంతర్జాతీయస్థాయి వైద్యాన్ని కృష్ణకు అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. మొదట ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్టు వార్తలొచ్చాయి. త్వరగా కోలుకుని వస్తారని అనుకున్నారు. కానీ వైద్యులు కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు చెప్పడంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. 24 గంటల తర్వాత హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కృష్ణ త్వరగా కోలుకొని క్షేమంగా బయటకు రావాలని ఆయన అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…