Krishna And Chiranjeevi : కృష్ణ‌, చిరంజీవి కాంబినేష‌న్‌లో సినిమా ఆగిపోవ‌డానికి కార‌ణం ఇదేనా..?

Krishna And Chiranjeevi : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో దాదాపు 350కి పైగా సినిమాలు చేశారు కృష్ణ‌. ఆయ‌న ఈ రోజు అకాల మ‌ర‌ణం చెందారు. కృష్ణ మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. చిరంజీవి సైతం త‌న సోష‌ల్ మీడియాలో మాటలకు అందని విషాదం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి వూపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం..వీటి కలబోత కృష్ణ గారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమ లోనే కాదు, భారత సినీపరిశ్రమ లోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ,అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియ చేసుకొంటున్నాను.. అంటూ మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. అయితే చిరంజీవి.. కృష్ణ‌కి చాలా పెద్ద అభిమాని. ఆయన కృష్ణ సినిమాలు చూసి ప్రేరణ పొంది చిత్ర రంగంలోకి ప్రవేశించారు. చిరంజీవి కృష్ణ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. తాను కృష్ణ సినిమాలు చూసి మద్రాస్ రైలు ఎక్కానని పలు సందర్భాల్లో చిరంజీవి చెప్పుకున్నారు.

Krishna And Chiranjeevi  combination movie why stopped
Krishna And Chiranjeevi

అయితే కృష్ణ.. మెగాస్టార్‌కి నో చెప్పడం అప్పట్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. చిరంజీవిని కృష్ణ ఎంతో ప్రోత్స‌హించాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో `కొత్తల్లుడు`, `కొత్త పేట రౌడీ`, `తోడు దొంగలు` చిత్రాలు రాగా, అవి మంచి విజయాలను అందుకున్నాయి. అయితే వీటిలో కీలక పాత్రల్లోనే చిరు నటించగా, `కొత్తల్లుడు`లో చిరు నెగటివ్‌ రోల్‌ చేయడం విశేషం. అయితే చిరు ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన స్నేహం కోసం మూవీలో కృష్ణ‌ని న‌టింప‌జేయాల‌ని అనుకున్నారు. కాని అందుకు నో చెప్పార‌ట‌. అందుకు కారణం ఆ పాత్ర చిరంజీవి స్నేహితుడి పాత్ర‌. అది అంత ఎలివేట్ కాద‌ని భావించి కృష్ణ ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది.

వీరి కాంబినేషన్‌లో `అగ్ని జ్వాల` అనే టైటిల్‌తో సినిమా చేయాలనుకున్నారు. నిర్మాత బాబూరావు ఓ మలయాళ హిట్‌ని తెలుగులో రీమేక్‌ చేయాలనుకున్నారు. ఇందులో అన్నాదమ్ములుగా కృష్ణ, చిరు నటించాల్సి ఉంది. కాని ప్రాజెక్ట్ డిలే కావడంతో చిరంజీవి డేట్స్ లాక్‌ అయిపోయాయి. దీంతో సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు మోహన్‌బాబు, నరేష్‌ల కాంబినేషన్లో `అగ్నిజ్వాల` తెరకెక్కింది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 month ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 month ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 month ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 month ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 month ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 month ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 month ago