Krishna And SP Balu : కృష్ణ సినిమాల‌కి పాటలు పాడ‌నన్న బాలు.. హిట్ కొట్టి చూపించిన సూప‌ర్ స్టార్..

Krishna And SP Balu : వివాదరహితులైన‌ బాలు, కృష్ణ‌ల‌కు ఇండస్ట్రీలో అందరితోనూ సత్సంబంధాలున్నాయి. కానీ ఒకానొక సందర్భంలో సూపర్ కృష్ణకు,బాలుకు మధ్య ఓ వివాదం తలెత్తింది.. ఆ గొడవ వల్ల మూడు సంవత్సరాలు కృష్ణ సినిమాలకు పాటలు పాడకపోవడంతో పాటు ఆయనతో కనీసం మాట్లాడలేదు బాలు. ఓ ఇంట‌ర్వ్యూలో బాలు ఈ విష‌యం గురించి తెలియ‌జేస్తూ.. ఓసారి ఫోన్‌లో మాట్లాడుకుంటుండగా ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందన్నారు. ఎన్నడూ కఠినంగా మాట్లాడుకోని మేము ఆరోజు పరస్పరం కాస్త నొప్పించుకునే రీతిలో మాట్లాడుకున్నట్లు చెప్పారు. అప్పటినుంచి ఆయనకు పాటలు పాడటం మానేసినట్లు తెలిపారు.

అయినప్పటికీ తాను ఎక్కడ కలిసినా కృష్ణ గారు మామూలుగానే మాట్లాడేవారని… తాను కూడా ఆయన పట్ల అంతే గౌరవంతో ఉండేవాడినని చెప్పారు. 1986లో కృష్ణ స్వీయ దర్శకత్వంలో సింహాసనం తెరకెక్కింది. ఇది భారీ బడ్జెట్ మూవీ. కృష్ణ డ్యూయల్ రోల్ చేశారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి సంగీతం అందించగా, ఈ మూవీలో పాటలన్నీ రాజ్ సీతారామ్-పి సుశీల పాడారు. సింహాసనం పాటలు సూప‌ర్ హిట్ కావ‌డంతో ప్రతి వేడుకలో మారుమ్రోగేవి.అయితే ఎస్పీ బాలును కాదని కృష్ణ అంత పెద్ద విజయం సాధించడం అప్పుడు హాట్ టాపిక్ అయింది.

Krishna And SP Balu what happened between them
Krishna And SP Balu

ఇండ‌స్ట్రీకి రెండు పిల్ల‌ర్స్ లాంటి వారు అయిన బాలు, కృష్ణ మ‌ధ్య ఈ వివాదాన్ని స‌ద్దుమ‌ణిగేలా చేసేందుకు … వేటూరి, రాజ్ కోటి ఇద్దరు ప్ర‌య‌త్నించారు. అయినా వివాదం సద్దుమణగలేదట.  ఒక‌ రోజు బాలు.. కృష్ణ గారి దగ్గరకు వెళ్లాక… సార్ ఆరోజు నేను ఫోన్‌లో ఏం చెప్పదలుచుకున్నానో… ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను… దయచేసి నన్ను వివరించనివ్వండని ఆయనతో బాలు అన్నార‌ట‌. అయితే కృష్ణ మాత్రం… ‘ఏమండీ అవేవీ వద్దండి… ఈరోజు నుంచి ఇద్దరం కలిసి మంచిగా పని చేసుకుందాం..’ అని చెప్పారన్నారు. ఆ ఒక్క మాటతో అంతా సెటిల్ అయిపోయిందన్నారు. ఆయనేమీ అడగలేదని… ఇక తాను కూడా ఏమీ చెప్పలేదన్నారు. అలా ఆ వివాదం సమసిపోయిందట‌.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago