Krishna Food Habits : సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులను అభిమానులు చాలా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వారు తినే ఆహారం నుంచి వేసుకొని దుస్తుల వరకు అన్నీ తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా నటీనటులు బరువు పెరగకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ అప్పట్లో అలాంటివి ఏమీ లేవు.. ముఖ్యంగా కృష్ణ గారు వంటి వారు ఆరోగ్యకరమైన ఆహారానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవారు. ఆహారపు అలవాట్లలో కృష్ణ గారి తీరే చాలా సపరేటుగా ఉంటుందని ఆయనతో జర్నీ చేసిన రచయితలు, కో ఆర్టిస్ట్ లు చాలామంది చెప్తూంటారు. ఇదే క్రమంలో ఆయనతో గూఢచారి 117 వంటి చాలా సినిమాలకు పనిచేసిన రచయిత తోటపల్లి మధు.. కృష్ణగారి ఫుడ్ హ్యాబెట్స్ విషయంలో ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అవేంటంటే..
కృష్ణగారు చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన మాటలు గమ్మత్తుగా ఉంటాయి. మార్నింగ్ ఇంటి నుంచి బయలుదేరి టిఫిన్ వంటివి పూర్తి చేసుకుని వస్తారు. 11 గంటలకు మన పెరుగు ఆవడ వాడు రాలేదా అని అడిగేవారు. అప్పట్లో షూటింగ్ ల్లో పెరుగు ఆవడ ఇచ్చేవారు. పైన బూందీ వేసి రుచిగా ఉండేది. ఒంటిగంట లంచ్ కు ఉదయానికి మధ్య గ్యాప్ లో ఇది ఇవ్వటంతో కృష్ణగారు ఈ ఐటం కోసం అడిగేవారు. అలాగే ఒంటిగంట లంచ్ కు వెళ్లి 3 గంటలకు వచ్చేవారు. ఓ అరగంట మాట్లాడుతూ సున్నుండల వాడు రావాలే అనేవారు. వచ్చాక అవి తినేవారు. మళ్లీ ఐదున్నరకు వీట్ దోస అని వేలు మణి హోటల్ నుంచి వచ్చేది. ఇవి మద్రాస్ స్టైల్స్. అప్పటి ప్రొడ్యూసర్స్ ఇవన్నీ మెయింటైన్ చేసేవారు. ఆయన ఎన్ని తిన్నా బ్రహ్మాండంగా ఉండేవారు. ఎక్కడా బరువు పెరిగేవారు కాదు.
ఆయనది మంచి ఫిజిక్.. అద్భుతంగా ఉండేవారు అని గుర్తు చేసుకున్నారు తోటపల్లి మధు. బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునే భోజనం రాజభోజనంలా, మధ్యాహ్న భోజనం సామాన్యుడి భోజనంలా, రాత్రిభోజనం పేదవాడి భోజనంలా ఉండటం ఆరోగ్యకరమైన అలవాటు అని చెప్పేవారు ఆయన. బాలెన్స్‌డ్ డైట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన నీళ్లు ఎక్కువగా తాగేవారు. అందుకే ఆయన ఎప్పుడూ షూట్ లో ప్రెష్ గా ఉండేవారంటారు. ప్రతిరోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగే వారు. మార్కెట్‌లో తేలికగా దొరకే జంక్‌ఫుడ్, బేకరీ ఫుడ్ తీసుకునేవారు కాదు. సెట్ లో మిగతా వాళ్లు తింటున్నా.. ఆయన ఆసక్తి చూపించేవారు కాదు అని మధు గారు కృష్ణ గారి గురించి చెప్పుకొచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…