Krishna Assets : కృష్ణ ఆస్తుల వివరాలు తెలుసా.. సూపర్ స్టార్ అయ్యుండి అంత తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే..?

Krishna Assets : సూపర్ స్టార్ కృష్ణ (79) ఇక లేరన్న సంగతి తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ కు కుటుంబ సభ్యులు తరలించారు. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో ఆయన మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. కృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమలో పెను విషాదాన్ని నింపింది. ఇక కృష్ణ మరణం సందర్భంగా ఆయన వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఆస్తి వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 1965లో కృష్ణ తేనే మనసులు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే టాలీవుడ్ లో కొత్త శకం మొదలైనట్లు అయింది. హీరోగా కృష్ణ అందుకోని విజయాలు అంటూ లేవు.

అంత పాపులారిటీ దక్కినప్పుడు కృష్ణ ఆర్థికంగా అపర కుబేరుడిగా ఎదిగి ఉండాలి. కానీ అది జరగలేదు. డబ్బు విషయంలో కృష్ణ ఎప్పుడూ అమాయకత్వంతోనే ఉండేవారట. ఈ విషయాన్ని విజయనిర్మల ఓ ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ సంపాదించిన మొత్తం ఆస్తుల విలువ 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తన స్వంత గ్రామం బుర్రిపాలెంలో, హైదరాబాద్, చెన్నై నగరాల్లో కృష్ణ పేరిట ఇళ్ళు ఉన్నాయి. అలాగే ఫామ్ హౌస్ లు కూడా ఉన్నాయి. కృష్ణ గారి గ్యారేజ్ లో మొత్తం 20 కోట్ల విలువ చేసే 7 కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ ఇమేజ్ తో పోల్చుకుంటే ఆయన సంపాదించిన ఆస్తులు చాలా తక్కువే అని ఇండస్ట్రీలో చాలా మంది అభిప్రాయం. ఒకే సమయంలో పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ నుంచి నాలుగైదు సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

do you know about Krishna Assets
Krishna Assets

దీంతో ఆర్థిక లావాదేవీల విషయంలో గందరగోళం నెలకొనడం, డబ్బు నష్టపోవడం జరిగేది. ఇక కృష్ణ గారికి ఆయన బలం ఆయనకే తెలియదట. తొలి చిత్రం తేనె మనసులుకి 2 వేలు రెమ్యునరేషన్. 2, 3 చిత్రాలతోనే కృష్ణకి స్టార్ డమ్ వచ్చేసింది. కానీ నిర్మాతలని రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం తెలియదట. స్టార్ డమ్ ఉన్నప్పటికీ 10 వేలు రెమ్యునరేషన్ చేరుకోవడానికి కృష్ణకి 35 సినిమాల సమయం పట్టిందట. అలాగే చెక్కులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన వారు కూడా చాలామంది ఉన్నారు అని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. నిర్మాత కష్టాల్లో ఉంటే రెమ్యునరేషన్ తగ్గించుకోవడం.. సినిమా ఫెయిల్ అయితే తక్కువ రెమ్యునరేషన్ తో అదే నిర్మాతకి డేట్లు ఇవ్వడం లాంటివి కృష్ణ గారి మంచి మనసుకి నిదర్శనం. ఒక దశలో అప్పుల కారణంగా పద్మాలయ స్టూడియో మూతపడే పరిస్థితి కూడా వచ్చిందని వార్తలు వచ్చాయి. మహేష్ బాబు హీరోగా సక్సెస్ అయ్యాక కృష్ణ ఫ్యామిలీ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.

Share
Usha Rani

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 month ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 month ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 month ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 month ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 month ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 month ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 month ago