Krishna : తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. టాలీవుడ్ లో జేమ్స్ బాండ్, కౌబాయ్ తరహా చిత్రాలను తీసుకు వచ్చి ఒక ట్రెండ్ సృష్టించారు కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమయంలో ఆయనతో పాటు ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించారు విజయనిర్మల. అప్పట్లో ఆమె నటిగా, దర్శకురాలిగా రాణించారు. ఆ సమయంలోనే కృష్ణ విజయనిర్మలను వివాహం చేసుకున్నారు. ఇందుకు కృష్ణ సతీమణి ఇందిరాదేవి కూడా ఒప్పుకున్నారు.
దర్శకుడు బాపు తెరకెక్కించిన సాక్షి మూవీలో కృష్ణకు జంటగా విజయనిర్మల నటించారు. ఆ మూవీలో కృష్ణ, విజయనిర్మల కెమిస్ట్రీ వెండితెరపై పండింది. ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. విజయనిర్మల వ్యక్తిత్వం, తెలివితేటలు నచ్చిన కృష్ణ గుడిలో రహస్య వివాహం చేసుకున్నారు. విజయనిర్మలకు కూడా అది రెండో వివాహం. నరేష్ మొదటి భర్తకు కలిగిన సంతానం. ఆమెకు మొదటి భర్తతో విబేధాలు ఉన్నాయి. ఇక ఈ రహస్య వివాహాన్ని మొదటి భార్య ఇందిరా వద్ద కృష్ణ దాచలేదు. విజయనిర్మలను పెళ్లి చేసుకున్నట్లు చెప్పేశారట. ఆ మాట విన్న ఇందిరా దేవి మౌనంగా ఉండిపోయారట.
ఏళ్ల తరబడి ఇందిరా దేవి అజ్ఞాతంలో ఉండి పోయారు. భార్యగా, తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తూ… లోప్రొఫైల్ మైంటైన్ చేశారు. ఇక ఇందిరాదేవి-కృష్ణలకు ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు తో పాటు పద్మజ, మంజుల, ప్రియదర్శి అనే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. కృష్ణ-విజయ నిర్మల వివాహం జరిగినప్పటికీ తాను బతికి ఉన్నంత కాలం కృష్ణనే భర్తగా ఉండాలని.. ఆయన సంతానాన్ని చూసుకుంటూ ఉంటానని చెప్పింది. ఆ విధంగా ఇందిరాదేవి తన మంచి మనసు చాటుకున్నారు. అలాగే కృష్ణ కూడా ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఇక విజయ నిర్మల కూడా కృష్ణను వివాహం చేసుకున్న తర్వాత పిల్లల్ని కనలేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…