Kodali Nani : ఏపీలో ఎన్నికల కౌంట్ డౌన్ దగ్గరపడుతుంది. నేతులు ఎండలని సైతం లెక్కచేయకుండా ప్రచారం హోరెత్తిస్తున్నారు. మరో వారం రోజుల్లో ప్రచారం ముగియనుండడంతో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ ఏపీలో ప్రచారానికి వస్తున్నారు. జగన్, చంద్రబాబు, పవన్ వరుస సభలతో ఓటర్లను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో గుడివాడ నుంచి పోటీలో ఉన్న వైసీపీ నేత కొడాలి నాని ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రీ ఎంట్రీ..పార్టీ నాయకత్వం చేపట్టటం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగుదేశం పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి రావాలంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ అభిమానులంతా కష్టపడి గెలిపిస్తే.. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తారని అన్నారు.
చంద్రబాబు కొడుకు లోకేష్ ను అధికారంలో కూర్చోబెడతారని.. అందుకే ఎన్టీఆర్ అభిమానులు గుండెమీద చేయి వేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు నాని. టీడీపీని ఓడించి, తన ఫ్రెండ్ ఎన్టీఆర్ కు గిఫ్ట్ గా ఇస్తానని కొడాలి నాని శపథం చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పగ్గాలు పట్టుకుంటేనే, అతడి అభిమానులు టీడీపీకి మద్దతివ్వాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పగ్గాలు ఎన్టీఆర్ కు రావాలంటే చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న టీడీపీని ఓడించాలన్నారు. చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్ల కోసం ఎగబడుతున్నారని ఆరోపించారు నాని. పెద్ద ఎన్టీఆర్ ను దుర్మార్గుడని, తెలుగుదేశం పార్టీకి పనికిరాడని మెడ పట్టి బయటకు గెంటి పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని, టీడీపీ పగ్గాలు అప్పగించేలా ఫ్యాన్స్ బుద్ధిచెప్పాలన్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ ను సోషల్ మీడియాలో చంద్రబాబు తిట్టించాడని.. తన సభల్లో జూనియర్ ఎన్టీఆర్ జెండాలు కనిపిస్తే, ఫ్యాన్స్ ను తన్నితరిమేశారన్నారు. తనకు ఎన్టీఆర్ రాజకీయంగా జన్మనిచ్చారని ఎక్కడైనా ధైర్యంగా చెబుతానన్నారు.తాను పెద్ద ఎన్టీఆర్‌కు భక్తుడినని.. నందమూరి హరికృష్ణ తనకు గురువని చెప్పుకొచ్చారు. 10 మంది జూ.ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకుని టీడీపీ కార్యక్రమాలకు వెళ్తే.. ఆ పార్టీ కార్యకర్తలు దాడులు చేశారని గుర్తు చేశారు నాని. తాను తిరిగే కారుకు ఎన్టీఆర్, వైఎస్సార్ రెండు ఫోటోలు పెట్టుకొని ధైర్యంగా తిరుగుతానన్నారు. తెలుగుదేశం పార్టీ గౌడ, యాదవ, మత్స్యకార, ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించిందని.. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించలేదన్నారు. సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక.. రాజ్యసభ స్థానాలు ఇస్తూ..ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో మెజార్టీ స్థానాలు వారికే కేటాయించారని గుర్తు చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…