Geetu Royal : ఇటీవల యువత చెడు అలవాట్లకి బానిస అవుతూ అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఇంట్లో వండుకునే ఫుడ్‌కి స్వస్తి చెప్పి బయట దొరికే చెత్త చెదారం తింటున్నారు. దాని వలన లేని పోని సమస్యలు వచ్చిపడుతున్నాయి. రీసెంట్‌గా గీతూ రాయల్ తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పలు విషయాలు షేర్ చేస్తూ ఇప్పటికైన యువత మేల్కోకకపోతే పెద్ద నష్టం జరుగడం ఖాయమని ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేసింది. వివరాలలోకి వెళితే బిగ్ బాస్ రీవ్యూయర్ గా కెరియర్ ప్రారంభించిన గీతూ రాయల్ .. ఆ తర్వాత బిగ్ బాస్ షోకు కూడా వెళ్లింది. అలాగే జబర్దస్త్ వంటి షోలతో పాటు అనేక షోలలో కనిపించి తెగ సందడి చేసింది. బిగ్ బాస్ తెలుగు 7 బిగ్ బాస్ బజ్ షోకు హోస్ట్‌గా కూడా చేసింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ముక్కుసూటిగా ప్రశ్నలు అడుగుతూ.. వారందరినీ ఓ ఆట ఆడుకుందీ క్యూట్ బ్యూటీ.
ప్రస్తుతం యాంకర్ ధనుష్ తో కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన గీతూ రాయల్.. పలు విషయాలపై మాట్లాడుతోంది..చాలా రోజుల క్రితం ఈ ఛానెల్ లో ఓ వీడియో పోస్ట్ చేయగా.. ఈ మధ్య అసలు కనిపించట్లేదు. అయితే తాజాగా ధనుష్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో గీతూ రాయల్ ఆరోగ్య పరిస్థితుల గురించి చెప్పాడు. ముఖ్యంగా ఆమె ప్రస్తుతం డిప్రెషన్ లో ఉందని చెప్పాడు. అలాగే ఐదారు నెలలుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న ఈమె ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని వివరించాడు. అంతేకాకుండా నేరుగా ఆమె వద్దకు వెళ్లి వీడియోను తీసి పోస్ట్ చేశాడు. ఇందులో గీతూ రాయల్ మాట్లాడుతూ.. తాను బ్యాంకాక్ వెళ్లి అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ తిన్నట్లు చెప్పింది. బొద్దింకలు, పిట్టలు వంటి అనేక రకాల ఆహార పదార్థాలను ట్రై చేసినట్లు వివరించింది.
ముఖ్యంగా చనిపోయేలోపు అన్ని చూడాలి, ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే అలా తిన్నానని.. దాని వల్లే తనకు ఈ ఆరోగ్య సమస్యలు వచ్చి ఉండవచ్చని చెప్పింది. ఇది మాత్రమే కాకుండా తాను విజయవాడకు అమ్మవారి దర్శనం కోసం అక్కడకు వెళ్లి.. దర్శించుకోలేదని, అలాగే తిరుచానూరుకు వెళ్లి కూడా దర్శించుకోకుండా వచ్చేసినట్లు వివరించింది. కేవలం తన వల్లే తనతో వచ్చిన వాళ్లు కూడా అమ్మావార్లను దర్శించుకోలేకపోయారని.. అందువల్ల కూడా తనకు ఇలా ఆరోగ్య సమస్యలు వచ్చాయోమో అని అనుమానం వ్యక్తం చేసింది. కోటి మందిలో ఒకరికి వచ్చే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తనకు వచ్చిందని చిన్నచిన్న ఆస్పత్రలు చుట్టూ తిరిగితే దాని గురించి తెలియదని.. ఇంత కాలంగా ఆ సమస్యతో ఇబ్బంది పడగా.. తాజాగా ఓ పెద్దాసుపత్రికి రాగా ఆ ఇన్ఫెక్షన్ బయట పడిందని చెప్పుకొచ్చింది. అలాగే దానికి రెండేళ్ల పాటు కంటిన్యూస్ గా ట్రీట్ మెంట్ తీస్కోవాలని.. ప్రతీ వారం ఇంజెక్షన్ వేయించుకోవాలని వివరించింది. ఈ సమస్య వల్ల తాను డిప్రెషన్ లోకి వెళ్లినట్లు.. అనేక ఇబ్బందులు పుడుతున్నట్లు వివరించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…